వజ్రాల నుంచి విద్యుత్ తయారీ.. ఎలాగో తెలుసా?

ప్రపంచంలో ఎక్కడ చూసినా వజ్రాల ధర అధికంగా ఉంటుంది.వీటిని ఆభరణాలలో ఉంచి ధరిస్తారు.

 Making Electricity From Diamonds Do You Know How Details, Diamond, Rings, Latest-TeluguStop.com

ఇలాంటి వజ్రాల ద్వారా విద్యుత్ తయారీ చేయొచ్చని ఎవరైనా అంటే నమ్ముతారా.కానీ ఇది నిజం.

పరిశోధకులు ఒక ఫ్యూజన్ రియాక్షన్‌ని సృష్టించడం ద్వారా డైమండ్స్ నుంచి విద్యుత్ తయారు చేయొచ్చని నిరూపించారు.న్యూక్లియర్ ఫ్యూజన్ నుండి క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసే దిశగా కాలిఫోర్నియాలోని లారెన్స్ లివర్‌మోర్ నేషనల్ లాబొరేటరీ కీలక ప్రయోగాలను చేస్తోంది.

సమీప భవిష్యత్తులో కాలుష్య ఉద్గారాలు లేని విద్యుత్ ఉత్పత్తిని డైమండ్ల ద్వారా ఉత్పత్తి చేసేందుకు ఈ లాబొరేటరీ కృషి చేస్తోంది.

Telugu Diamond, Diamonds, Latest-Latest News - Telugu

లేజర్ బీమ్ కాంతిని ఇటీవల చిన్న చిన్న డైమండ్ ఫ్యూయల్ క్యాప్సూల్స్‌తో కూడిన పరికరంపై ప్రసరించేలా చేశారు.ఆ సమయంలో లేజర్‌ల శక్తి కంటే ఎక్కువ శక్తి ఆ ఫ్యూజన్ ఇగ్నిషన్ నుండి విడుదలైంది.పరమాణువులు ఒకదానికొకటి క్రాష్ అయినప్పుడు అణు కలయిక జరుగుతుంది.

అప్పుడే వేడి విడుదలవుతుంది.సూర్యుడు అగ్నిగోళంలా మండడానికి ఇదే కారణం.భూమిపై అణు సంలీనాన్ని సాధించడానికి, పరమాణువులను విపరీతమైన ఉష్ణోగ్రతలకు వేడి చేయాలి.192 శక్తివంతమైన లేజర్ కిరణాలను ఉపయోగించి కేవలం పెప్పర్‌కార్న్ పరిమాణంలో ఉండే హైడ్రోజన్ ఐసోటోపుల లక్ష్యాన్ని లారెన్స్ లివర్‌మోర్ నేషనల్ లాబొరేటరీ ప్రయోగించింది.

Telugu Diamond, Diamonds, Latest-Latest News - Telugu

ఈ ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చింది.న్యూక్లియర్ ఫ్యూజన్ కోసం చేసే ప్రయోగాలలో కృత్రిమ డైమండ్లను వినియోగిస్తున్నారు.వీటిని జర్మనీకి చెందిన డైమండ్ మెటీరియల్స్ కంపెనీ అత్యంత ఖచ్చితత్వంతో తయారు చేస్తోంది.వీటి తయారీలో చిన్న లోపం ఉన్నా న్యూక్లియర్ ఫ్యూజన్ చర్యలు దెబ్బతింటాయి.అడ్డంకులను అధిగమించి ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ఇదే కార్యరూపం దాల్చితే గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల దుష్ప్రభావాలు లేదా దీర్ఘకాలిక రేడియోధార్మిక వ్యర్థాలు లేకుండా ప్రజలకు సమృద్ధిగా విద్యుత్ అందించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube