రవితేజ, రమేష్ వర్మ, సత్యనారాయణ కోనేరు `ఖిలాడి` ఫస్ట్ సింగిల్ రిలీజ్‌

మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ `ఖిలాడి` షూటింగ్ ముగింపు దశలో ఉంది.ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు.

 Mass Maharaja Ravi Teja, Ramesh Verma, Satyanarayana Koneru `khiladi` First Sing-TeluguStop.com

ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇటీవ‌ల ర‌వితేజ‌, డింపుల్ హ‌య‌తి మీద తెర‌కెక్కించిన పాట ప్రోమోను రిలీజ్ చేశారు మేక‌ర్స్‌.

ఆ వీడియో అందరినీ ఆకట్టుకుంది.తాజాగా వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘ఇష్టం’ అనే మొదటి పాటను రిలీజ్ చేశారు.

ఈ పాటలో డింపుల్ హయతి చీరకట్టులో ఆకట్టుకున్నారు.రవితేజ మీదున్న ప్రేమను డింపుల్ ప్రకటించేట్టుగా ఈ పాట కొనసాగుతుంది.తన డ్యాన్సులతో డింపుల్ హయతి కట్టిపడేయగా.రవితేజ ఎప్పటిలానే తన ఎనర్జీతో అద‌ర‌గొట్టారు.

తెరపై ఈ జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది.

ఇక ఈ పాట‌కు ప్రేక్షకులు ఇట్టే కనెక్ట్ అయ్యేలా అద్భుతమైన మెలోడి ట్యూన్‌ను దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చారు.

శ్రీ మణి అద్భుతమైన సాహిత్యం అందించగా హరి ప్రియ గానం అందరినీ ఆకట్టుకుంటోంది.యశ్ మాస్టర్ ఈ పాటను అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు.

Telugu Dimple Hathiya, Khiladi, Ramesh Varma, Ravi Teja, Tollyood-Latest News -

థియేటర్లో ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేసేందుకు దర్శకుడు రమేష్ వర్మ కష్టపడుతున్నారు.సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణులు కెమెరామెన్‌లుగా వ్యవహరిస్తున్నారు.బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయ‌నున్నారు.

ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది.

శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు.శ్రీమణి సాహిత్యాన్ని అందిస్తుండగా.అమర్ రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube