ఏప్రిల్ 2 నుంచి మొదలైన చైత్ర నవరాత్రులు( Chaitra Navratri ) శ్రీరామనవమితో ముగిసిపోతాయి.నవరాత్రులలో భాగంగా దుర్గాదేవి( Goddess Durga )ని భక్తులు తొమ్మిది అవతారాలలో పూజిస్తూ ఉంటారు.ఈ ఏడాది శ్రీరామనవమి( Sri Rama Navami ) ముహూర్తం ఏప్రిల్ 10వ తేదీన తెల్లవారుజామున 1.32 నిమిషములకు మొదలయ్య ఏప్రిల్ 11వ తేదీ తెల్లవారుజామున మూడు గంటల 15 నిమిషాలకు ముగుస్తుంది.నవరాత్రులు సంవత్సరానికి రెండు సార్లు జరుపుకుంటారు.మార్చి లేదా ఏప్రిల్ లో చైత్ర నవరాత్రులు జరుపుకుంటారు.అలాగే అక్టోబర్, నవంబర్ లో దుర్గా నవరాత్రులను జరుపుకుంటారు.ఇవి దసరాతో ముగుస్తాయి.
అయితే నవరాత్రులలో ఏ పనులు చేయాలి ఏ పనులను చేయకూడదు ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే శ్రీరామనవమి రోజు ఈ పనులను చేయాలి.అన్ని నవరాత్రి రోజులలో అఖండ దీపాన్ని వెలిగించాలి.ఇది సాధ్యం కాకపోతే పండుగ ముగిసే వరకు ప్రతి రోజు ఉదయం సాయంత్రం హారతి ఇవ్వడం మంచిది.
అన్ని నవరాత్రి రోజులలో దుర్గా చాలీసా, దుర్గా సప్తసతి పాటించాలి.ఉపవాసం ఉన్నప్పుడు హైడ్రేటెడ్ గా ఉండడం చాలా ముఖ్యం.అందుకోసం నిమ్మరసం, కొబ్బరి నీరు, మజ్జిగ, గ్రీన్ టీలు తీసుకుంటూ ఉండాలి.ఇంకా చెప్పాలంటే చెడు మాటలను అసలు మాట్లాడకూడదు.
నవరాత్రులలో ఎటువంటి తప్పులు చేయకూడదు.దీని వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

నవరాత్రులలో చేయకూడని పనులలో ముఖ్యంగా మాంసాహారం, మద్యపానానికి దూరంగా ఉండటం ఎంతో మంచిది.ఉల్లిపాయ, వెల్లుల్లి తినడం అసలు మంచిది కాదు.వీలైతే ఇవి లేకుండా వంటకాలు వండడం మంచిది.నవరాత్రి రోజులలో జుట్టును కత్తిరించకూడదు.అలాగే షేవింగ్ చేయకూడదు.పూజా సమయంలో ఎవరైనా ఎలాంటి బెల్టు, చెప్పులు, బూట్లు లేదా తోలుతో చేసిన వస్తువులను ఉపయోగించకూడదు.
నవరాత్రులు తొమ్మిది రోజుల్లో ఎవరిని బాధపెట్టకూడదు.ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు.
ఇంకా చెప్పాలంటే నవరాత్రి సమయంలో శరీరక సంబంధాలకు దూరంగా ఉండటం మంచిది.