రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు విసిరిన సవాలుకు బోయినపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు.ఈ సందర్బంగా బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు బోయినపల్లి మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు మీరు ఎప్పుడు రమ్మన్న తేది, సమయం, చెప్పిన మేము బోయినపల్లి మండల కాంగ్రెస్ నాయకులతో కలసి బహిరంగ చర్చకు రావటానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
బోయినపల్లి మండలంలో ఉన్న రోడ్ల మీద అయిన, కల్వర్ట్ ల మీద అయిన,డబల్ బెడ్ రూమ్ ఇండ్ల మీద అయిన, దళిత బంధు మీద అయిన, గృహలక్ష్మి మీద అయిన, నారాయణ పూర్ కుడి కాలువ మీద అయిన, మిడ్ మానైర్ ముంపు గ్రామాల మీద అయిన,
వడ్ల కొనుగోలు లో జరుగుతున్న దోపిడీ మీద అయిన,రుణమాఫీ మీద అయిన, కొండగట్టు ఆంజనేయు స్వామికి 100 కోట్ల నిధుల మీద అయిన, నిరుద్యోగ భృతి, మండల కేంద్రంలో గురుకుల బిల్డింగ్ మీద అయిన, బోయినపల్లి మండలం లో ఏ అభివృద్ధి కి సంబందించిన విషయం మీద అయిన మేము చర్చకి సిద్ధంగా ఉన్నామని అన్నారు.తమ నాయకులు మేడిపల్లి సత్యం రెండు సార్లు ఓడిపోయాన ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చిన నేను ఉన్న అంటూ గత 10 సంవత్సరాలనుండి ప్రజా సమస్యల మీద నిరంతరం శ్రమిస్తున్నారు.
మా నాయకుడికి వచ్చిన ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు సత్యం మీద అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పులి లక్ష్మిపతి గౌడ్, తడగొండ ఎంపీటీసీ ఉయ్యాలా శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఏనుగుల కనుకయ్య,బోయినపల్లి ఉపసర్పంచ్ పిట్టల మోహన్, మండల కాంగ్రెస్ నాయకులు బోయిని ఎల్లేష్, ఎండీ బాబు,నల్ల మోహన్ ,సాన సత్యం, ముదం శ్రీనివాస్, లక్ష్మరెడ్డి, పెండ్యాల శ్రీనివాస్ రెడ్డి,గుంటి జలందర్, మహేందర్, బోయిని పర్శరాములు,మండయ్య, కనకరాజు, గంగిపెల్లి లచ్చయ్య, మహేష్, సాయి, దూస జనార్దన్,ప్రశాంత్,యువజన కాంగ్రెస్ నాయకులు నిమ్మ వినోద్ రెడ్డి, నక్క శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.