నువ్వునేను.2001లో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ డూపర్ హిట్ మూవీ.ఈ సినిమాలో హీరోగా ఉదయ్ కిరణ్ నటించగా, హీరోయిన్ గా అనిత చేసింది.ఆర్పీ పట్నాయక్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.చక్కటి కథతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది.ఈ సినిమాలో భాగస్వామ్యం అయిన ఉదయ్ కిరణ్, తేజ, ఆర్పీ పట్నాయక్ కు ఎనలేని పేరు తెచ్చింది.
అంతేకాదు.ఈ సినిమాకు అవార్డుల పంట పండింది.
ఉత్తమ దర్శకుడు, ఉత్తమ హాస్యనటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ ఛాయాగ్రాహకుడు, ఉత్తమ సహాయ నటుడు విభాగాల్లో 5 నంది పురస్కారాలు వచ్చాయి.నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు వరించాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు దర్శకుడు తేజ.
నిజానికి ఈ సినిమాకు హీరోగా ఉదయ్ కిరణ్ ను అనుకోలేదని చెప్పాడు.
తన కథ మాధవన్ ను మనుసులో పెట్టుకుని తయారు చేసినట్లు చెప్పాడు.అయితే తాను తెలుగు సినిమాలు చేయనని చెప్పడంతో అప్పటికే చిత్రం సినిమా చేసి మంచి క్రేజ్ తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ ను అనుకున్నట్లు చెప్పాడు.
నిజానికి ఉదయ్ కిరణ్ చిత్రం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నా.అతడికి పెద్దగా అవకాశాలు లేవని చెప్పాడు.
అందుకే తను రోజూ తన ఆఫీస్ కు వచ్చేవాడని చెప్పాడు.మాధవన్ ఈ సినిమా చేయను అని చెప్పడంతో ఉదయ్ కిరణ్ ను సెలెక్ట్ చేసినట్లు వెల్లడించాడు.
ఇక హీరోయిన్ల కోసం తన వేట మొదలయ్యిందన్నాడు.ఆరుగురిని ఈ సినిమా కోసం ఆడిషన్స్ కు పిలిచినట్లు చెప్పాడు.అందులో ఓ ముంబై భామ ఈ క్యారెక్టర్ కు సూటవుతుంది అని భావించినా.తను పెట్టిన కండీషన్లు నచ్చలేదన్నాడు.అందుకే వచ్చిన ఆరుగురిలో అస్సలు బాలేదు అని చెప్పిన అమ్మాయినే ఈ సినిమాకు హీరోయిన్ గా పెట్టినట్లు చెప్పాడు.నిర్మాత కిరణ్ ఆ అమ్మాయి ఏం బాగుంది.? అని అడిగినా.నటనకు అందంతో పనిలేదని చెప్పి ఒప్పించినట్లు చెప్పాడు.