విద్యుత్ కోత తో వేలాది కోళ్ల మృతి.

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District) ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పౌల్ట్రీ రైతు సద్ది రాజిరెడ్డి కి చెందిన పౌల్ట్రీ ఫామ్ ( Poultry farm )కు విద్యుత్ సరఫరా లో అంతరాయం మూలంగా నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరా కాకపోవడంతో వేడి తీవ్రత తట్టుకోక పౌల్ట్రీ ఫామ్ షెడ్ లోని వేలాది కోళ్లు మృతి చెందాయి.ఈ ఘటన తో రైతుకు తీవ్రంగా నష్టం వాటిల్లింది.

 Thousands Of Chickens Died Due To Power Cut.-TeluguStop.com

పౌల్ట్రీ ఫామ్ రైతు సద్ది రాజు కుటుంబము తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

విద్యుత్ అంతరాయం తో స్వయం ఉపాధి పొందాలనుకున్న పౌల్టీ రైతు రాజు కు తీవ్ర నష్టం వట్టిల్లిన సంఘట న పై స్థానిక బిజెపి నాయకులు పౌల్టీ ఫార్మ్ ను సందర్శించి రాజు కుటుంబాన్ని పరమార్శించారు.

ఈ సందర్బంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ విద్యుత్ అంతరాయము తో రైతు రాజిరెడ్డి కి చెందిన మూడు వేల వరకు కోళ్లుమరణించ డానికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమని ఆరోపించారు.సమాచారం లేకుండా విద్యుత్ కోత విధించడం, అనేక గంటల పాటు విద్యుత్ కోత విధించడం వలన కోళ్ల ఫారం లో కోళ్లు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేక మృత్యువాత పడడం జరిగిందని,కోళ్ల ఫారం యజమాని విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న కనికరించకపోవడంతో అధిక నష్టం జరిగిందని,3 వేల వరకు కోళ్లు మరణించడం జరిగిందని అధికారుల తీరు ను బిజెపి నాయకులు తప్పు పట్టారు.

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా జరిగిన నష్టమని అందుఁజూ విద్యుత్ శాఖ రైతుకు ఐదు లక్షల రూపాయలు నష్ట పరిహా రం చెల్లించాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు.కొన్నేళ్లుగా గల్ఫ్ దేశానికి ఉపాధి బాట పట్టిన రైతు రాజి రెడ్డి కి ముగ్గురు ఆడపిల్లలు పెద్దవారు కావడంతో వారిని పోషించుకొనుటకు స్వగ్రామానికి వచ్చాడని , గ్రామంలో స్వయం ఉపాధి నిమిత్తం బ్యాంకు లోన్, తెలిసిన వారి వద్ద అప్పుచేసి పౌల్ట్రీ ఫారం ఏర్పరచుకొని జీవితాన్ని సాగిస్తున్న క్రమంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఒక నిరుపేద కుటుంబానికి ఆర్థిక నష్టం జరుగడం బాధాకరమన్నారు.

తమను ఆదుకోకుంటే చావే శరణ్యం అంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవు తున్నారని బిజెపి నాయకులు ఆవేదన వ్యక్తం చెశారు.రైతు కుటుంబానికి అండగా ఉంటామని, విద్యుత్ సహకార సంఘంపై పోరాటం చేస్తామని, నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందేలాచూస్తామని భారతీయ జనతా పార్టీ( Bharatiya Janata Party) నేతలు భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల శాఖ మండల ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకుడు పారిపెల్లి సంజీవరెడ్డి, కిరణ్ నాయక్, జిల్లా బిజెపి పార్టీ అధికార ప్రతినిధి బంధారపు లక్ష్మారెడ్డి, ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షుడు నంది నరేష్,వంగ శ్రీకాంత్ రెడ్డి, గాజుల దేవదాస్, మల్లారపు రాజేందర్ రెడ్డి, శంకర్ రాగుల శ్రీనాథ్ రెడ్డి, రామేశ్వర్ రెడ్డి, రాజిరెడ్డి,అల్లం నవీన్,కార్తీక్ రెడ్డి,అజ్మీర రాజు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube