అనారోగ్యంతో మృతి చెందిన పోలీస్ జాగిలం

రాజన్న సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్ లో పోలీస్ జాగిలం (లాబ్రడార్ రిట్రీవర్) సంతతికి చెందిన రాజా , వయస్సు 15 సంవత్సరాలు అనారోగ్యంతో శనివారం ఉదయం మరణించింది.జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ అధికారులు , పోలీస్ జాగిలం హ్యాండ్లర్ మల్లేశం తో కలసి రాజా పై పుష్పగుచ్ఛాలు వేసి ఘనంగా నివాళులర్పించి రాజా సేవలు మరువలేనివని సంతాపాన్ని వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ.

 Police Dog Died Due To Illness, Police Dog , Police Dog Died , Rajanna Sircilla-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాజా గత 14 సంవత్సరాల నుండి జిల్లాలో విఐపి.వివిఐపిలు సందర్శించినప్పుడు (ఆర్ఓపి) స్నిపర్, బాంబులు, మందు పాత్రలు, గుర్తించడంలో చాకచక్యంగా వ్యవహరించి విధులు నిర్వహించేదని కొనియాడారు.2010 సంవత్సరంలో రాజా తన హ్యాండ్లర్ మల్లేశం తో పాటుగా ఎనిమిది నెలల పాటు IITA,మొయినాబాద్ నందు బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని జిల్లాకు కేటాయించగా జిల్లాలో గత 14 సంవత్సరాలుగా సేవలందించిందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఐ లు యాదగిరి, మాధుకర్, రమేష్, రాజా హ్యాండ్లర్ మల్లేశం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube