తాజాగా ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు( Chairman Cherukuri Ramoji Rao ) తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.మూడు రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించారు.
పరీక్షలు చేసిన వైద్యులు స్టంట్ వేశారు.ఆ తర్వాత ఆయన పరిస్థితి కాస్త క్రిటికల్ అయింది.
రెండు రోజు కూడా తీవ్ర అస్వస్థతతో వెంటిలేటర్ పై వైద్య చికిత్స పొందుతూ తాజాగా ఆయన తుది శ్వాస విడిచారు.నేడు తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు ఆయన కన్నుమూశారు.

రామోజీ ఫిల్మ్‌సిటీలోని( Ramoji Film City ) నివాసానికి పార్థివదేహం తరలించారు.ఇక ఆయన మరణంతో ఒకసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.చాలామంది సెలబ్రిటీలు( Celebrities ) ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.ఈ క్రమంలోనే ఆయనతో ఉన్న అనుభవాన్ని పంచుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ ట్వీట్ లు చేస్తున్నారు.ఇకపోతే రామోజీ గ్రూప్‌లో ఈనాడు మీడియా, మార్గదర్శి చిట్‌ఫండ్స్, ప్రియా ఫుడ్స్, ఉషాకిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్‌సిటీ, కళాంజలి, బ్రిసా షోరూమ్స్ వంటి సంస్థలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.

తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రను వేసుకున్నారు రామోజీరావు.అంతేకాకుండా ఈయన ఎంతోమంది ప్రముఖులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.మరి ఆ సెలబ్రిటీలు ఎవరు అన్న విషయానికి వస్తే.రామోజీరావు చాలా మంది హీరోలను పరిచయం చేశారు.ఉదయ్ కిరణ్( Uday Kiran ) ను పరిచయం చేస్తూ చిత్రం అనే సినిమాను నిర్మించారు.ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
అలాగే తరుణ్( Tarun ) ను పరిచయం చేస్తూ నువ్వే కావలి సినిమాను నిర్మించారు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.
అలాగే దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఆనందం సినిమాను కూడా రామోజీరావే నిర్మించారు.అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదట హీరోగా నటించిన నిన్ను చూడాలని సినిమాను కూడా ఉషాకిరణ్ మూవీస్ నిర్మించింది.
తనీష్ ను హీరోగా పరిచయం చేస్తూ నచ్చావులే సినిమా నిర్మించారు.ఇక ఆయన నిర్మించిన చివరి సినిమా దాగుడుమూత దండాకోర్.