పిల్లలు మన్ను తినడం మంచిదేనా?

కృష్ణుడు చిన్నప్పుడు మన్ను తిన్నాడు.తల్లిని తన చిలిపి చేష్టలతో చాలా ఇబ్బంది పెట్టాడు.

 Is Eating Dirt Or Clay Good For Children?-TeluguStop.com

ఏడిపిస్తూనే నవ్వించాడు.చిన్నికృష్ణుడిలాగే చిన్నపిల్లలు ఇప్పుడు కూడా మన్ను తింటున్నారు.

అందరు కాదు కాని, కొందరు.ఇంతకి చిన్నపిల్లలు మన్ను ఎందుకు తింటారు? మన్ను,మట్టి తినడం మంచిదేనా? దీని వల్ల లాభాలున్నాయా నష్టాలున్నాయా?

చిన్నపిల్లలకి కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి బాగా ఉంటుంది.మన్ను వారి చేతికి ఏదో కొత్తరకం తిండిలా అనిపిస్తుందట.దాని రుచి చూద్దాం అనేసి మన్ను ఇలా తీసుకోని అలా నోట్లో వేసుకుంటారు.అచ్చం చిన్ని కృష్ణయ్య లాగే.కాని కృష్ణుడు అపుడెప్పుడో వేల సంవత్సరాల క్రితం మట్టి తిన్నాడు.

అప్పుడు మట్టి అంటే కూడా స్వచ్ఛమైనదే.పంటపొలాల మట్టిలో దొరికే మినరల్స్ ఇప్పుడున్న మట్టిలో దొరుకుతున్నాయా? లేదు కదా.

మన్ను మంచిదై ఉండాలే కాని, దాన్ని రుచి చూస్తే తప్పేం లేదట.అయితే అది మోతాదు మించకూడదు.

ఇలా నోట్లో వేసుకోవడానికి, కూర్చోని తినడానికి చాలా తేడా ఉంటుందిగా.మట్టి రుచి వల్ల రోగనిరోధకశక్తి పెరిగి, మధుమేహం, లావు అవటం లాంటివి దరిచేరడం కష్టమే అంట.అందుకే అంటారు, మట్టిలో బ్రతికే రైతుకున్న అరోగ్యం, జంక్ ఫుడ్ తింటూ బ్రతికే పట్నం వాళ్ళకి ఎక్కడ ఉంటుందని.

కాని, ఇప్పుడున్న కలుషితమైన వాతవారణం, మట్టిలో కలిసపోతున్న మెటల్స్, ప్లాస్టిక్ ని దృష్టిలో పెట్టుకోని చూస్తే, మీ పిల్లలని మట్టి తినకుండా అడ్డుకోవడమే మంచిది అని సూచిస్తున్నారు డాక్టర్లు.

ఎందుకంటే ఇప్పుడు మన్నులో మినరల్స్ కాదు, బ్యాక్టీరియా దొరుకుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube