ఓటు హక్కు వినియోగంఫై అవగాహన స్వీప్ ఆద్వర్యంలో కార్యక్రమాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా :రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంఫై ( స్వీప్ సిస్టంటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రా్రాల్ పార్టిసిపేషన్ ) ఆద్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. సిరిసిల్లలోని నర్సింగ్ కళాశాల, వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని పాలిటెక్నిక్ కళాశాల, తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి, జిల్లెల్లలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వోటర్ హెల్ప్ లైన్ యాప్(వి ఎచ్ ఎ ) లో అందుబాటులో ఉన్న సేవలు, ఓటు హక్కు నమోదుకు అర్హత వయసు, ఆన్లైన్, ఆఫ్ లైన్ లో ఓటు హక్కు ఎలా నమోదు చేయాలి, ఫారం నెంబర్ 6,7,8 వినియోగం, ఓటు హక్కు నమోదులో తరచూ చేసే తప్పులు ఎలా నివారించాలి తదితర అంశాల ఫై వివరించారు.

 Programs Under The Auspices Of Awareness Sweep To Exercise Voting Rights , Exerc-TeluguStop.com

  అనంతరం ఆయా విద్యాలయాల్లో ప్రిన్సిపాల్ లు మాట్లాడారు.రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గ్రామాలు, పట్టణాల్లో ఓటు హక్కు వినియోగించు కునేలా విద్యార్థులు అవగాహన కల్పించాలని కోరారు.

  ఆయా కార్యక్రమాల్లో నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ లిల్లి మేరీ, వైస్ ప్రిన్సిపాల్ విజయ కుమారి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ రాజగోపాల్, అధికారులు శ్రీదేవి, ఎస్టేట్ షహెబాజ్, కనకయ్య తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube