పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నియంత్రించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పొగాకు ఉత్పత్తుల వాడకం నియంత్రించేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పొగాకు వ్యతిరేక దినోత్సవం నేపథ్యంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో పొగాకు కంట్రోల్ అంశంపై అదనపు కలెక్టర్ పి గౌతమితో కలిసి జిల్లా స్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.

 Planned Measures To Control The Use Of Tobacco Products District Collector Anura-TeluguStop.com

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ పొగాకు వాడకాన్ని నియంత్రించేందుకు నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న బహిరంగ ప్రదేశాల్లో పోగ త్రాగకూడదు అనే స్పష్టమైన బోర్డులను ఏర్పాటు చేయాలని, సమీకృత జిల్లా కలెక్టరేట్ మొదలుకొని వేములవాడ ఆలయం, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యవసాయ మార్కెట్ యార్డులు

ఆసుపత్రులు మండల కార్యాలయాలు, బస్టాండ్ , ఆలయాలు, మార్కెట్, సినిమా ధియేటర్లు మొదలగు జన సంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో జూన్ 15 నాటికి పొగాకు త్రాగకూడదు అనే బోర్డులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

జూన్ చివరి నాటికి జిల్లాలోని అన్ని విద్యా సంస్థల్లో పొగాకు వాడకం వల్ల కలిగే కష్టాలను విద్యార్థులకు స్పష్టంగా వివరించాలని, పొగాకు ఉత్పత్తులు వాడకం వ్యతిరేకంగా వ్యాసరచన పోటీలు, వివిధ రకాల పోటీలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.జిల్లాలో ఉన్న ఇంటర్ ,డిగ్రీ కళాశాలలో పొగాకు వాడకం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ వైద్యులు ప్రత్యేక సెషన్స్, కాన్సిల్లింగ్ నిర్వహించాలని కలెక్టర్ కోరారు.

పొగాకు త్రాగే అలవాటున్న వ్యక్తులు ఆ అలవాటు మానుకునేలా సహకారం అందించేందుకు జిల్లాలో డీ అడక్షన్ కేంద్రం,

మద్యం పొగాకు వంటి దురలవాట్లు ఉన్న వారి కోసం జిల్లాలో ఏర్పాటు చేసిన డీ అడక్షన్ కేంద్రం వినియోగించుకునేలా విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.పొగాకు ఉత్పత్తుల నిషేద చట్టం -2003 పై అవగాహన కలిగి అందులోని నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, పొగాకు ఉత్పత్తుల నిషేద చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశాలలో పొగ త్రాగడం, పొగాకు ఉత్పత్తులపై ప్రచారం , విద్యాలయాల చుట్టూ 100 గజముల లోపు పొగాకు సేవనం, ఉత్పత్తులపై అమ్మకం నిషేదమని,18సం.

లలోపు పిల్లలకు పొగాకు ఉత్పత్తుల అమ్మకం, వారిచే అమ్మించడం నిషేదమని, ఈ నిబంధనలు జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమములో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ సుమన్ మోహన్ రావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్, డి.పి.అర్.ఓ.వి.శ్రీధర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గోన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube