తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు సోను సూద్ ( Sonu Sood )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగు తో పాటు బాలీవుడ్( Bollywood ) లో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సోనూసూద్.
రీల్ లైఫ్ లో విలన్ పాత్రలో నటించినప్పటికీ రియల్ లైఫ్ లో కొన్ని వేల మందికి సహాయం చేసి కలియుగ కర్ణుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు సోనూ సూద్.అలాగే పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించి మెప్పించారు.
సోనూ సూద్.పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా అరుంధతి.
ఈ సినిమాలో పశుపతి క్యారెక్టర్ లో జీవించేసాడు సోనూ సూద్.అలా చాలా సినిమాల్లో విలన్ పాత్రల్లో మెప్పించారు.కరోనా సమయంలో వేలమందికి అండగా నిలిచారు.ఇప్పటికే సహాయం చేస్తూనే ఉన్నారు.తన వద్దకు సహాయం అని కోరి వచ్చిన ఏ ఒక్కరినీ వెను తిరిగి పంపించకుండా తోచిన విధంగా సహాయం చేసి వారిని సంతోషపెట్టే పంపిస్తున్నారు.చాలామంది అభిమానులు సోనూ సూద్ ఫోటోని ఇళ్లలో పెట్టుకొని దేవుడిలా భావిస్తూ పూజలు కూడా చేస్తున్నారు.
ఇకపోతే ఇప్పటికే ఎంతోమందికి సహాయం చేసి అండగా నిలిచిన సోనూ సూద్ తాజాగా మరో నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి గొప్ప మనసును చాటుకున్నారు.డెహ్రాడూన్‌కు( Dehradun ) చెందిన ఒక పేద కుటుంబంలోని మూడేళ్ల బాలుడికి వైద్య సహాయం అందించారు.అత్యవసరంగా గుండెకు సర్జరీ చేయాల్సి రావడంతో సోనూ సూద్ ఆదుకున్నారు.ఆ బాలుడికి సర్జరీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయించారు.ఇది చూసిన నెటిజన్స్ సోనూ రియల్ హీరో అంటూ పోస్టులు పెడుతున్నారు.సోనూ సూద్ రియల్ హీరో గొప్ప వ్యక్తి మనసున్న వ్యక్తి అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.