సబ్బండ వర్గాల సంక్షేమమే బిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం!

రాజన్న సిరిసిల్ల జిల్లా :సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలో గాజుల మల్లయ్య ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం నిరుపేద ముస్లింలకు అందిస్తున్న రంజాన్ తోఫా(గిఫ్ట్ )ప్యాక్ లను లబ్ధిదారులకు అందజేసిన జడ్పి చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి.

 Brs Government's Mission Is The Welfare Of The Lower Classes! , Brs , Brs Gover-TeluguStop.com

ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలు పండుగలను ఘనంగా నిర్వహించుకోవాలని సీఎం కేసీఆర్ బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలకు కొత్త దుస్తులు పంపిణీ చేస్తున్నారని తెలిపారు.అన్ని వర్గాల ప్రజలు పండుగలను సంతోషంగా చేసుకోవాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు.

పేదింటి ఆడపిల్లల వివాహాలకు తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ ద్వారా సాయం చేస్తూ అదుకొంటుదన్నారు.మైనార్టీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలను అందిస్తూ వారి అభివృద్ధికిపాటుపడుతుందన్నారు.

మైనార్టీల సంక్షేమం కోసం షాదీ ముబారక్, మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం టిఆర్ఏస్ ప్రభుత్వ మేనని అన్నారు.రాష్ట్రంలో అన్ని మతాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమానంగా గౌరవిస్తున్నారని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అన్ని మతాల పండుగలను అధికారికంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు.తెలంగాణ ప్రభుత్వం మత సామరస్యాన్ని కోరుకుంటుందని, మత విద్వేషాలను ప్రోత్సహించదు అని అన్నారు.

కెసిఆర్ నాయకత్వంలో మన రాష్ట్రంలో అన్ని మతాల వారు అన్నదమ్ముల కలిసి మెలిసి ఉంటున్నారు.మంత్రి కేటీఆర్ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నారు అని కొనియాడారు.

ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందo కళ చక్రపాణి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, కౌన్సిలర్ చందన, జిల్లా మైనారిటీ అధికారి సర్వర్మియా, తహశీల్దార్ విజయ్, ముస్లిం సోదరి సోదరులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube