రాజన్న సిరిసిల్ల జిల్లా :గుడ్ ప్రై డే సందర్భంగా మూడు రోజుల పండుగలో భాగంగా రన్ ఫర్ జీసెస్ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రన్ ఫర్ జీసేస్ యొక్క ముఖ్య ఉద్దేశం లోక కళ్యాణం, లోకంలో శాంతి వుండాలే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే మంచి ఉద్దేశంతో క్రైస్తవ మతం ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా గొప్పగా చేసుకునేటువంటి మూడు రోజుల పండగ అని వేములవాడలో ఈ పండగ చేసుకోవడం చాలా అభినందనీయమని అన్నారు.
రాష్ట్రంలో కులం, మతం, జాతి తేడా లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్ని రంగాల్లో వేములవాడ పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని సహకరిస్తున్న అన్ని వర్గాల ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసారు.వేములవాడ పట్టణం యొక్క గొప్పతాన్ని మన ఆశయాలను, ఆకాంక్షలను, నమ్మకన్నీ మన యొక్క హక్కులను, బాధ్యత లను తెలియజేసుకుంటూ ఎవరి ఆధ్యాత్మికత ను వారు చాటి చూపుతూ అభివృద్ధి లో సంక్షేమం లో ముందుకెళ్తున్నామని అన్నారు.
ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి గుడ్ ప్రై డే పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామతీర్థం మాధవి-రాజు , కౌన్సిలర్లు యాచమనేని శ్రీనివాస్ , కో-ఆప్షన్ మెంబెర్ నీరటి సువర్ణ-మల్లేశం , క్రైస్తవ సంఘం జిల్లా అధ్యక్షులు స్యామ్ , ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు