రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం ఆనంతపల్లి గ్రామం నుంచి వట్టెంల గ్రామానికి వెళ్లే దారిలో వర్షాల కారణంగా రోడ్డు మొత్తం బురదమయంగా మారింది.నిత్యం ఈ రోడ్డు మార్గం ద్వారా పొలాలకు వట్టేంల కు ప్రయాణించే ప్రయాణికులు,వాహనదారులు ,రైతులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు,
గ్రామ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ,వాహనదారులు ఆరోపిస్తున్నారు,తక్షణమే సంబంధిత అధికారులు చొరవ తీసుకొని తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని గ్రామ ప్రజలు,ప్రయాణికులు కోరుతున్నారు.