రాజన్న సిరిసిల్ల జిల్లా :సత్సంగ సదనంలో ఈనెల 5 వ తేదీన సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5-00 గంటల వరకు గీత ఆద్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభించబడుతాయని సత్సంగ సదనం అధ్యక్షులు బ్రహ్మచారి లక్ష్మారెడ్డి తెలిపారు.సత్సంగ సదనం వ్యవస్థాపకులు శ్రీ శ్రీ శ్రీ భక్త శ్రీ సరస్వతి గోవిందరాజు గారి 10 -08- 2024 వ తేదీన 3 వ ఆధ్మికం కార్యక్రమాలు నిర్వహించబడుతాయన్నారు.
ప్లవనామ సంవత్సర శ్రావణ మాస శుద్ధ షష్టి శుక్రవారం.తేదీ 13- 08-2021 శుక్రవారం రోజున గోవిందా రాజు లు పరమపదించారు.3వ ఆధ్మికం పురస్కరించుకుని సత్సంగ సదనంలో తేదీ 05-08-2024 సోమవారం నుంచి తేదీ 14- 08 -2024 బుధవారం వరకు ఉదయం 09-00 గంటల నుంచి 12-00 గంటల వరకు మధ్యానం 2-00 గంటల నుంచి సాయంత్రం 5-00 గంటల వరకు హైదరాబాద్ కు చెందిన బ్రహ్మశ్రీ సంగిరాల రాజేంద్ర ప్రసాద్ శాస్త్రి చే రామాయణం బోధిస్తారు.
గీత పారాయణ , శివ పూజ , సూర్య నమస్కారం , సత్సంగం ఉదయం 7-00 గంటల నుంచి 9-00 గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుండి 2-00 గంటల వరకు సత్సంగం సాయంత్రం ఏడు గంటల నుంచి 8 గంటల వరకు సత్సంగం సత్సంగ సదనం అధ్యక్షులు ఋ బ్రహ్మచారి లక్ష్మారెడ్డి బోధిస్తారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని లక్ష్మారెడ్డి కోరారు.