రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం జిల్లా పరిషత్ పాఠశాల లో జరిగిన అవగాహన సదస్సు లో వేములవాడ పట్టణ ఎ ఎస్ పి శేషాద్రిని రెడ్డి హాజరై పోక్సో చట్టo, గంజాయి, గుడ్ టచ్,బ్యాడ్ టచ్ లపై అవగాహన కల్పించారు.విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని పిల్లలకు సూచించారు.
ఈ సందర్బంగా పిల్లలతో, తల్లిదండ్రులతో, ఉపాధ్యాయులతో మాట్లాడి వారి వారి పాత్రలను, నిర్వహించాల్సిన విధులను తెలిపి, వారి అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు.ఈ కార్యక్రమం లో కోనరావుపేట ఎస్ ఐ ప్రశాంత్ రెడ్డి,ఎస్ ఐ రాహుల్ రెడ్డి లు పాల్గొన్నారు.