రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) కు చెందిన ముత్యాల కృష్ణ రెడ్డి కి చెందిన ట్రాక్టర్ కేజీవీల్ ఒకటినీ గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్ళినట్లు రైతు తెలిపారు.
నిన్న రాత్రి వరకూ పొలం దున్ని రాత్రి ట్రాక్టర్ కేజివీల్స్( Tractor Cage Wheels ) ను ఎల్లమ్మ గుడి సమీపంలో కేజివీల్స్ వదిలి వెళ్ళాడు.
బుదవారం ఉదయం సదరు రైతు ముత్యాల కృష్ణ రెడ్డి పొలం వద్దకు వెళ్లి చూసే సరికి ఒక కేజివీల్ ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్ళినట్లు సదరు రైతు తెలిపారు.కేజీవీల్ ఎత్తుకెళ్లిన సంఘటన పై స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.
గ్రామంలో గల సీసీ కెమెరాల ను పరిశీలిస్తే ఎవరు కేజీవీ ల్స్ ఎత్తుకెళ్ళారనేది తెలుస్తుందని రైతు పోలీసులను కోరారు.