గేమ్ ఛేంజర్ టీంపై నెటిజన్ల ట్రోల్స్.. ఆ ఫోటో తప్ప మరో ఫోటో లేదంటూ?

రామ్ చరణ్ శంకర్ ( Ram Charan , Shankar )కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీ( Game Changer ) పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అని అభిమానులు ఇప్పటికే ఫిక్స్ అయ్యారనే సంగతి తెలిసిందే.గేమ్ ఛేంజర్ 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన జరగండి జరగండి సాంగ్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

 Kiara Advani Birthday Game Changer Movie Poster Details Inside Goes Viral , K-TeluguStop.com

అయితే ఈ మధ్య కాలంలో ఈ సినిమా నుంచి సరైన అప్ డేట్స్ రాలేదనే సంగతి తెలిసిందే.

ఈరోజు కియారా అద్వానీ పుట్టినరోజు కాగా కియారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా కియారా అద్వానీ( Kiara Advani)కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.అయితే ఈ పోస్టర్ జరగండి జరగండి సాంగ్ లో కియారా లుక్ తో ఉన్న పోస్టర్ కావడంతో గేమ్ ఛేంజర్ పై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.ఈ సాంగ్ పోస్టర్లు మినహా మరో పోస్టర్ లేదా అంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

గేమ్ ఛేంజర్ సినిమా మేకర్స్ ఈ విమర్శల గురించి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.ఇండియన్2 డిజాస్టర్ కావడం వల్ల ఇప్పటికే రామ్ చరణ్ అభిమానులలో టెన్షన్ నెలకొంది.గేమ్ ఛేంజర్ మేకర్స్ ఇలా తప్పు మీద తప్పు చేస్తే మాత్రం సినిమాపై అంచనాలు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించి కొత్త కంటెంట్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద కూడా గేమ్ ఛేంజర్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.త్వరలో ఈ సినిమా నుంచి విడుదల కానున్న సెకండ్ సింగిల్ ఫ్యాన్స్ ను అంచనాలకు మించి మెప్పించనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

గేమ్ ఛేంజర్ మూవీ ఒకే భాగంగా తెరకెక్కనుందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube