అనుమతులు లేకుండా డీజేలు నడిపించవద్దు

అత్యవసరమైతే ముందస్తు అనుమతి తప్పనిసరి నిబంధనలు ఉల్లంగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు డీజే నిర్వాహకులకు వేములవాడ పట్టణ సీఐ వీర ప్రసాద్ హెచ్చరిక రాజన్న సిరిసిల్ల జిల్లా :రానున్న గణేష్ ఉత్సవాలతో పాటు ఇతర పండగల సందర్భంగా విచ్చలవిడిగా డీజేలు పెట్టి, ప్రజలకు ఇబ్బందులు కలిగించకూడదని డీజే నిర్వాహకులను వేములవాడ పట్టణ సీఐ వీర ప్రసాద్ హెచ్చరించారు.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అదేశాల మేరకు సోమవారం పట్టణానికి చెందిన డీజే నిర్వాహకులతో పట్టణ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

 Do Not Conduct Djs Without Permits , Ganesh Celebrations, Ci Veera Prasad-TeluguStop.com

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శబ్దకాలుష్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని, విపరీతంగా ధ్వనులు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలనే ప్రభుత్వ సూచనలతో వేములవాడ పట్టణ పరిధిలో డీజే బాక్సుల వాడకంపై నిషేధం విధించడం జరుగుతుందని అన్నారు.ఎవరికైనా అత్యవసర సమయాల్లో డీజే లు తప్పనిసరిగా వాడాల్సిన పరిస్థితి ఉంటే అలాంటి వారు పోలీసు శాఖ వారి ముందస్తు అనుమతులు తీసుకొని, తక్కువ శబ్దం కలిగించే విధంగా బాక్స్ లు ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు.

పోలీస్ శాఖ వారి ఆదేశాలను కాదని ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా డీజేలను వాడితే అలాంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube