గంజాయి కేసులు ఇద్దరు నిందుతుల అరెస్ట్, రిమాండ్ కి తరలింపు.

105 గ్రాముల గంజాయి,రెండు మొబైల్స్ స్వాధీనం.ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో ఎస్.

 Two Accused Arrested In Ganja Cases, Sent To Remand , Two Accused , Cannabis Tes-TeluguStop.com

ఐ శ్రీకాంత్ తో కలసి వివరలు వెల్లడించిన రూరల్ సి.ఐ మొగిలి.నిందుతుల వివరాలు.1.గుంటి శివ కుమార్ ,s/o రాజయ్య ,20 సం”లు, r/o పొత్తూరు,ఇల్లంతకుంట.2.బుర్ర ప్రణయ్,s/o జనార్దన్ ,21 సం”లు,r/o గన్నేరువరం.

ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ.ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామానికి చెందిన శివ కుమార్ అనే వ్యక్తి పొత్తూరు గ్రామంలో బేకరీ నిర్వహిస్తూన్నాడు.

శివ కుమార్ గత కొద్ది రోజులుగా సిగరెట్లూ త్రాగడానికి అలవాటు ఉండగా మెల్లిమెల్లిగా అందులో గంజాయి సిగరెట్లు తాగడం అలవాటు కాకా,బేకరిలో కేకులు తీసుకరవడానికి గన్నేరువరం వెళ్ళినప్పుడు అక్కడ బుర్ర ప్రణయ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి,ఇద్దరు కలసి అప్పుడపుడు కరీంనగర్ లో గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయి కొనుక్కొని వచ్చి సిగరెట్ లలో పెట్టుకొని తాగేవాళ్ళని,శివ కుమార్ కి బేకరీ ద్వారా వచ్చే డబ్బులు జల్సాలకు సరిపడక గంజాయి తీసుకవచ్చి ఎక్కువ ధరకు అలవాటు ఉన్న వాళ్లకు అమ్మలని అనుకోని ఇదే విషయాన్ని ప్రణయ్ కి చెప్పగా ఇద్దరు కలసి ఈ రోజు ఉదయం 09:00 గంటల సమయంలో ఇల్లంతకుంట మండలం వంతడుపుల రోడ్ లో గల బతుకమ్మ తెప్ప వద్దకు అమ్మడానికి రాగ నమ్మదగిన సమాచారం మేరకు వారిద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద 105 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని రిమాండ్ కి తరలించడం జరిగిందన్నారు.గంజాయి తాగే వారిని పట్టుకునేందుకు జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లకి గంజాయి టెస్ట్ కిట్లు అందుబాటులోకి వచ్చాయని ప్రతి పోలీస్ స్టేషన్ లలో రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే గంజాయి టెస్ట్ నిర్వహించి వాటికి బానిసై తాగే వారిని పట్టుకోవడం జరుగుతుందని,ప్రజలు ఎవరైనా గంజాయి కి సంబంధించిన సమాచారం డయల్100 లేదా టాస్క్ఫోర్స్ సి.ఐ ఫోన్ నెంబర్ 87126 56392 కి సమాచారం అందించగలరని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుదన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube