ఇటీవల రోజుల్లో హెల్త్, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపుతున్న వారందరూ వైట్‌ను ఎవైడ్ చేసేస్తున్నారు.వైట్ రైస్ డైట్‌లో ఉంటే శరీర బరువు కంట్రోల్‌లో ఉండదు.
వైట్ రైస్‌లో ఉండే అధిక కార్బోహైడ్రేట్సే అందుకు కారణం.అందు వల్లనే చాలా మంది వైట్ రైస్‌కు బదులుగా వేరే వేరే ఆహారాలను తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.
కానీ, వైట్ రైస్‌ను తింటూ కూడా బరువు తగ్గొచ్చని మీకు తెలుసా.అవును, ఇప్పుడు చెప్పే విధంగా వైట్ రైస్‌ను వండికుని తింటే మీ బాడీ వెయిట్ మీ కంట్రోల్‌నే ఉంటుంది.
మరి లేట్ ఏంటీ.బరువు తగ్గాలంటే వైట్ రైస్‌ను ఎలా వండుకుని తినాలో ఓ చూపు చూసేయండి.
రైస్‌ను వండేటప్పుడు అందులో రెండు స్పూన్ల కొబ్బరి నూనెను వేసి ఉడికించి తినాలి.ఇలా కొబ్బరి నూనె వేసి వండిన వైట్ రైస్‌ను తింటే శరీరంలో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది.
బరువు క్రమ క్రమంగా తగ్గు ముఖం పడుతుంది.అదే సమయంలో శరీరానికి ఎన్నో పోషకాలు సైతం అందుతాయి.

అలాగే వైట్ రైస్‌ను నేరుగా కంటే.అందులో క్యారెట్, బంగాళదుంప, క్యాప్సికమ్, టమాటా ఇలా కూరగాయలను వేసి వండుకోవాలి.ఇలా వండుకున్న రైస్‌ను కొంచెం తిన్నా చాలు ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది.దాంతో చిరుతిండ్లపై మనసు మల్లకుండా ఉంటుంది.ఫలితంగా బరువు తగ్గుతాయి.
ఇక వైట్ రైస్‌లో పెసలను వేసి వండుకుని తినొచ్చు.
అది కూడా పొట్టు తీయని పేసలను వేసి రైస్‌ను వండుకుని తింటే.శరీర బరువు కంట్రోల్ తప్పకుండా ఉంటుంది.
అదే సమయంలో పెసల్లో ఉండే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు శరీరానికి అంది ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది.