జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మాజీ భార్య రేణు దేశాయ్( Renu Desai ) నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.తరచుగా తన రెండో పెళ్లి గురించి కామెంట్లు చేస్తుంది.
పవన్ కళ్యాణ్ తనను వదిలేసాడు అంటూ చెబుతుంది.ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంది.
అప్పుడప్పుడు తన పిల్లల గురించి కూడా ఆసక్తికరమైన విషయాలు చెబుతుంది.మరాఠీ మాట్లాడే కుటుంబంలో జన్మించిన ఈ అందాల తార రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ మహారాష్ట్రలోని పూణెలో సెటిల్ అయ్యింది.
ఈ గుజరాతీ ముద్దుగుమ్మ మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది.కెరీర్ తొలినాళ్లలో శంకర్ మహదేవన్ “బ్రీత్ లెస్” మ్యూజిక్ వీడియోలో మెరిసింది.ఆపై హీరో పవన్‌తో కలిసి బద్రి, జానీ సినిమాల్లో యాక్ట్ చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.ఆపై మరాఠీ సినిమాల్లో యాక్టివ్‌గా అయింది.2013లో “మంగళాష్టక్ వన్స్ మోర్”తో ప్రొడ్యూసర్‌గా మారింది.2014లో “ఇష్క్ వాలా లవ్”తో దర్శకురాలిగా అవతారం ఎత్తింది.
2023లో ఆమె టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) సినిమాలో నటించిన ద్వారా తెలుగు ఇండస్ట్రీలో కం బ్యాక్ ఇచ్చింది.దానికంటే ముందు జీ తెలుగు సీరియల్ “రాధమ్మ కూతురు”లో( Radhamma Kuthuru Serial ) పార్వతీదేవిగా కనిపించి వావ్ అనిపించింది.ఒక హీరోయిన్ గా మాత్రమే కాదు రేణు దేశాయ్ వేరే పనులు కూడా చేస్తూ మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని నిరూపించుకుంది.
ఖుషి, బాలు, గుడుంబా శంకర్, జానీ, అన్నవరం సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది.అంతేకాదు, ఖుషి (2001)( Khusi Movie ) సినిమాలోని “యే మేరా జహా”పాటను ఎడిట్ కూడా చేసింది.బాలు సినిమాలోని “హట్ హుట్జా” పాటకు కూడా ఎడిటర్ గా పనిచేస్తుంది.
సినిమా ఇండస్ట్రీలో దర్శకురాలిగా, ప్రొడ్యూసర్‌గా, నటిగా ఎడిటర్‌గా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఇలా విభిన్నమైన రోల్స్ పోషిస్తూ ఆశ్చర్యపరిచింది.సినిమాల్లో కాకుండా బయట రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తూ చాలా డబ్బులు కూడా సంపాదించింది.
పవన్ కళ్యాణ్ కూడా మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని చెప్పుకోవచ్చు అతని హీరో గానే కాకుండా దర్శకుడిగా, ఫైట్ మాస్టర్, సింగర్, రైటర్, పొలిటీషియన్ ఇలా విభిన్నమైన రోల్స్‌లో రాణించారు.వీరిద్దరూ విడిపోయినా సరే టాలెంట్స్ విషయంలో మాత్రం ఒకరికొకరు పోటీగా అనునిత్యం నిలుస్తుంటారు.
ఒకవేళ కలిసి ఉన్నట్లయితే రేణు దేశాయ్ తప్పనిసరిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉండేది.