టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామందికి ముద్దు పేర్లు ఉన్నాయి.ఉదాహరణకి పవన్ కళ్యాణ్ను పవర్ స్టార్ అంటూ పిలుస్తారు.
చిరంజీవి టాలెంట్ ని బట్టి మెగాస్టార్ అని పిలుస్తుంటారు.అల్లు అర్జున్‌ను స్టైలిష్ స్టార్ అని, రామ్ పోతినేనిని ఎనర్జిటిక్ స్టార్ అని అంటారు.
నితిన్ ని చాక్లెట్ బాయ్ అని ముద్దుగా పిలుస్తారు.ఇంకా హీరోలకే కాకుండా దర్శకులకు కూడా ఇలాంటి ముద్దు పేర్లు ఉన్నాయి.
ఉదాహరణకు త్రివిక్రమ్ ని మాటల మాంత్రికుడు అని , రాజమౌళిని జక్కన్న అని, సుకుమార్ ని లెక్కల మాస్టారు అని, సుక్కు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు.ఈ పేర్లు మాత్రమే కాదు స్టేజ్ నేమ్స్ కూడా వీరికి పెట్టిన వాళ్ళు ఉన్నారు.
వీళ్లకి ఇలాంటి పేర్లు ఎవరు పెట్టారో తెలిస్తే మనం ఆశ్చర్యపోక తప్పదు.వీళ్ళకి ఆ పేర్లు ఇతర సెలబ్రిటీలు పెట్టారు.వారెవరో తెలుసుకుందాం.
• సూర్య
గజినీ మూవీ హీరో సూర్య( Surya ) అసలు పేరు శరవణన్ శివకుమార్. ఈ నటుడు 22 ఏళ్ల వయస్సులో నెరుక్కు నెర్ (1997)లో సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.ఇదొక రొమాంటిక్ యాక్షన్ త్రిల్లర్ ఇందులో విజయ్ హీరోగా నటించాడు ఈ మూవీకి దర్శకుడు మణిరత్నం.
ఆయనే సూర్యకు సూర్య అని పేరు పెట్టారు.ఈ సినిమా మంచి హిట్ అయింది దీని తర్వాత శరవణన్ కాస్త సూర్య గా మారిపోయాడు.
• జక్కన్న
కర్ణాటక రాష్ట్రంలో జక్కన్న( Jakkanna ) అనే ఒక శిల్పి ఉండేవాడు.12వ శతాబ్దంలో ఇతడు బాగా ఫేమస్ అయ్యాడు.ఎందుకంటే అతను ఒక శిల్పం పర్ఫెక్ట్ గా వచ్చేంత వరకు దాన్ని చెక్కుతూనే ఉంటాడు.అందుకోసం ఎంత సమయం అయినా తీసుకుంటాడు.ఇక సినిమాలను అంత అందంగా తీర్చిదిద్దుతూ ఉంటాడు రాజమౌళి.( Rajamouli ) జక్కన్న లాగా రాజమౌళి కూడా పర్ఫెక్షనిస్ట్ కాబట్టి అతనికి యాక్టర్ రాజీవ్ కనకాల ఆ పేరు పెట్టారు.
• మాస్ మహారాజ్
డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక ఈవెంట్ సందర్భంగా యాంకర్ సుమతో మాట్లాడుతూ రవితేజను( Ravi Teja ) మాస్ మహారాజ్ గా పిలవాలంటూ చెప్పారు.
• పవర్ స్టార్
పవన్ కళ్యాణ్ కు( Pawan Kalyan ) పోసాని కృష్ణ మురళి పవర్ స్టార్ అనే పేరు పెట్టారు.కెరీర్ స్టార్టింగ్ లోనే పవన్ కళ్యాణ్ స్టామినా చూసి ఆ పేరు అతనికి సూట్ అవుతుందని ఈ సినీ రచయిత భావించారు.