రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మహిళలకు , విద్యార్థినిల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తూ గత సంవత్సరం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ జ్వాల (సెల్ఫ్ డిఫెన్స్ ) తో జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలో సుమారు 2000 మందికి పైగా శిక్షణ ఇవ్వడం జరిగిందని,మరల ఆపరేషన్ జ్వాల -2 పేరుతో సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అందులో భాగంగా ఈ రోజు తంగాలపల్లి మండలం మండేపల్లి లోని ఆదర్శ పాటశాలలొ ఏర్పాటు చేసిన ఆపరేషన్ జ్వాల -2 ప్రారంభ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించిన జిల్లా ఎస్పీ.ఈ సందర్భంగా ఎస్పీమాట్లాడుతూ….
ప్రస్తుత రోజులలో మహిళలకు స్వీయ రక్షణ చాలా అవసరమని ,
జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ జ్వాల పేరుతో సెల్ఫ్ డిఫెన్స్ కు అధిక ప్రాధాన్యత ఇస్తు జిల్లాలో ఉన్న పాఠశాలలు, కళాశాలల్లో సెల్ఫ్ డిఫెన్స్ పై అనుభవం కలిగిన శిక్షకులచే శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి గత సంవత్సరం సుమారుగా 2000 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని, ఈ కార్యక్రమానికి మంచి స్పందన రావడంతో ఈ సంవత్సరం ఆపరేషన్ జ్వాల -2 పేరుతో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి అన్ని పాఠశాలలో, కళశాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.ఇలాంటి సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణలు వలన విద్యార్థినీలు ఆపద సమయాలలో ధైర్యంగా సమస్యలు ఎలా ఎదుర్కొవ్వలో ఉపయోగపడతాయని, కేవలం ఆకతాయిల బారి నుండే కాకుండా చైన్ స్నాచింగ్, మహిళలపై లైంగిక దాడులు జరిగే క్రమంలో వారిని సమర్ధవంతంగా తిప్పికొట్టడం లాంటి టెక్నిక్స్ నేర్పించడం జరుగుతుందన్నారు.
తెలంగాణ పోలీసులు మహిళలు, విద్యార్థినీల భద్రత, వారి రక్షణ కోసం నిరంతరం పని చేస్తున్నాయని, షీ టీమ్ పోలీసులు జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, బస్ స్టాండ్స్, తదితర ప్రాంతాలలో సివిల్ దుస్తులతో సంచరిస్తూ ఆకతాయిల బారి నుండి రక్షణ కల్పించే విధంగా పని చేస్తున్నారని తెలిపారు మహిళలూ విద్యార్థినులు ఏలాంటి వేధింపులకు గురైన నిర్భయంగా ముందుకు వచ్చి జిల్లా షీ టీమ్ కి గాని డయల్ 100 కి సమాచారం అందించి సమస్యను పరిష్కరించుకోవలని అన్నారు.
యవత , విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా మంచిగా చదువుకొని ఉన్నత లక్షలను సాధించాలన్నారు.
మత్తు పదార్థాలకు మానసిసంగా బానిస కావడం ద్వారా అనుకోకుండా నేరాలు చేసే అవకాశం ఉంటుందని, యువత విద్యార్థులు గంజాయి, మత్తు పదార్థాలను తరిమికొట్టడంలో భాగస్వామ్యం కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ మొగిలి,ఎస్.ఐ సుధాకర్, ఆదర్శ పాటశాల ఉపాధ్యాయ బృందం, కరేట్ శిక్షకులు, విద్యార్థులు పాల్గొన్నారు.