డిడి లు తిరిగి ఇవ్వడానికి కృషిచేసిన అధికార యంత్రాంగం కు ధన్యవాదాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా :గత ప్రభుత్వ హయాంలో రెండవ విడత గొర్రెల ( Sheep Distribution )కోసం యాదవులు తీసిన డిడి ల డబ్బులు మూడు రోజులలో జమ కానున్నాయని జిల్లా పశు వైద్యాదికారి కొమురయ్య తెలిపారు.గతంలో యాదవులు గొర్రెల ను పొందడం కోసం డిడి లు తీయగా డబ్బులు వాపస్ రాకపోవడం,గొర్రెలు ఇవ్వకపోవడంతో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒగ్గు బాలరాజు యాదవ్,రాష్ట్ర యాదవ హక్కుల పోరాట సమితి అధికార ప్రతినిధి కోక్కు దేవేందర్ యాదవ్ లు ప్రజావాణి లో పిర్యాదు చేయగా స్పందించిన జిల్లా అడిషనల్ కలెక్టర్ గౌతమి కి పిర్యాదు చేయడం జరిగింది.

 Thanks To The Authorities For Their Efforts To Return The Dds-TeluguStop.com

కాగ గురువారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ( Collector Anurag Jayanthi )కాసేపటి క్రితం 346 మంది జిల్లా వ్యాప్తంగా యాదవులు డిడి లు వాపస్ తీసుకోవడం కోసం దరఖాస్తు చేసుకోగా కాసేపటి క్రితం పెండింగ్ డీడీలు వాపస్ ఇచ్చే నగదు బదిలీ పై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంతకం చేశారు.ఇట్టి డబ్బులు సోమవారం వరకు వారి వారి అకౌంట్లలో జమ చేయబడతాయని జిల్లా పశు వైద్యాదికారి కొమురయ్య తెలిపారు.

ఇంకా సుమారు 700 లకు పైగా డిడి లు యాదవులకు వాపస్ ఇచ్చేది ఉందని అట్టి డబ్బులు కూడా అతి త్వరలో జిల్లా కలెక్టర్ అనుమతితో వారి వారి అకౌంట్లలో జమ కానున్నాయి.గొర్రెల డిడి లు వాపస్ ఇవ్వడానికి చొరవ చూపిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కి ,జిల్లా పశు వైద్యాదికారి కొమురయ్య, మండల పశు వైద్యాదికారి రేణుకకు అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అద్యక్షులు ఏ టి యాదవ్, ప్రధాన కార్యదర్శి ఒగ్గు బాలరాజు యాదవ్, రాష్ట్ర యాదవ హక్కుల పోరాట సమితి అధికార ప్రతినిధి కోక్కు దేవేందర్ యాదవ్,జిల్లా యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ఆసరీ బాలరాజు యాదవ్ లు ధన్యవాదాలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube