రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) 17వ పోలీస్ బెటాలియన్ సర్దాపూర్ నందు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకి దరఖాస్తులు చేసుకున్న వారికి 11-06-2024 నుండి 12-06-2024 వరకు రెండు రోజులు ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు సర్ధపూర్ బెటాలియన్ ( Sardhapur Battalion )లో నిర్వహించారు.మొత్తం 23 ఉద్యోగాలకు 120 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
ఈ ఇంటర్వ్యూలను నిర్వహించడానికి 13వ బెటాలియన్ కమాండెంట్ సయ్యద్ జమిల్ భాష హాజరయ్యారు.
వారి సమక్షంలో 17వ బెటాలియన్ కమాండెంట్ ఎస్.శ్రీనివాస రావు, అడ్మినిస్ట్రేటివ్ అఫిసర్ ఇ .ప్రమీల వారికి ఇంటర్వ్యూలను నిర్వహించారు.ఇంటర్వ్యూలకు ఎంపిక కాని అభ్యర్థులు నిరాశపడకుండ మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవాలని 17వ బెట్టాలియన్ కామండెంట్ ఎస్.శ్రీనివాస రావు తెలిపారు.