అమ్మిన ప్రభుత్వ భూమిపై విచారణ జరపాలని ఆర్డీఓ కు ఆదేశాలు జారీ చేసిన జిల్లా అడిషనల్ కలెక్టర్ గౌతమి

రిక్వెస్ట్ స్టాఫ్ దగ్గర బస్ లు ఎందుకు ఆపడం లేదని ఆర్టీసి అధికారులపై జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆగ్రహం ప్రజావాణి లో పిర్యాదు.పిర్యాదు పై స్పందించిన జిల్లా అడిషనల్ కలెక్టర్ గౌతమి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో గల ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 24,25,26 లో సుమారు ఐదు ఎకరాల కు పైగా ప్రభుత్వ భూమి ఉందని ఇట్టి భూమిని దూప దీప నైవేద్యం కింద ప్రభుత్వ భూమి ఇవ్వగా అట్టి భూమిని కొంత మంది రియాల్టర్లకు అమ్మి వెంచర్లు చేసి కొంతమందికి ఇట్టి భూములను అమ్మినారని, వెంటనే స్వాదీనం చేసుకోవాలని ఇట్టి ప్రభుత్వ స్థలంలో ఎల్లారెడ్డిపేట లో ఉన్న సుమారు 13 వేల మంది జనాభా కు అవసరమయ్యే విధంగా డెలి వేయిజ్ మార్కెట్ (ఇంటిగ్రేటెడ్ మార్కెట్) నిర్మాణం కోసం ప్రభుత్వానికి నివేదిస్తామని స్థానిక మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్,యూత్ కాంగ్రెస్ మండల నాయకులు బుచ్చి లింగు సంతోష్ గౌడ్ లు సోమవారం జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జరిగిన ప్రజావాణి లో పిర్యాదు చేశారు.

 District Additional Collector Gauthami Has Issued Instructions To The Rdo To Con-TeluguStop.com

పిర్యాదు స్వీకరించిన జిల్లా అడిషనల్ కలెక్టర్ గౌతమి క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆర్డీఓను ఆదేశించారు.ఎల్లారెడ్డిపేట లో సిరిసిల్ల- కామారెడ్డి ప్రధాన రహదారి ఆనుకుని ఉన్న డబల్ బెడ్ రూమ్ ల వద్ద (కేసీఆర్ ఆత్మగౌరవ సముదాయం) వద్ద బస్ లు నిలపడం లేదని ఒక కిలోమీటరు దూరం నడుచుకుంటూ వచ్చి బస్ ఎక్కుతున్నారని రీక్వెస్ట్ బస్ స్టాప్ ఉన్నప్పటికీ బస్ లు ఆపడం లేదని పేర్కొనగా అక్కడ బస్ లు ఎందుకు నిలపడం లేదని ఆర్టీసి అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే అక్కడ బస్ లు ఆపేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసి అధికారులను ఆదేశించారు.అదే విధంగా మండల కేంద్రము లో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుకున్న విద్యార్థులు ఆర్టీసి బస్సులలో వీర్నపల్లి మండలంతో పాటు ఎల్లారెడ్డి పేట మండల చుట్టూ పక్కల వారు చదువుకోవడానికి వచ్చి కిలో మీటరు దూరం నడుస్తున్నారని ఇక్కడ రిక్వెస్ట్ స్టాఫ్ ఏర్పాటు చేయాలని కోరగా వెంటనే ఏర్పాట్లు చేయాలని ఆమె ఆర్టీసి అధికారులను ఆదేశించారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube