ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విమర్శలకు బోయినపల్లి వినోద్ కుమార్ కౌంటర్ ఇచ్చారు.రాష్ట్రంలో బీజేపీ ఓటమిని మోదీ అంగీకరించారన్నారు.
తెలంగాణలో బీజేపీ గెలువదనే నిధులు, హామీలు ఇవ్వలేదని విమర్శించారు.ఉద్యోగాల కామన్ రిక్రూట్ మెంట్ బిల్లును గవర్నర్ చేత తొక్కిపెట్టి యూనివర్సిటీలో ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని అనడం విడ్డూరంగా ఉందన్నారు.
వారసత్వ రాజకీయాలపై మాట్లాడే అర్హత మోదీకి లేదని చెప్పారు.బీజేపీలో రెండువందల మంది వరకు నాయకుల వారసులు ఉన్నారని తెలిపారు.
తెలంగాణ గ్రామ పంచాయతీలకు అత్యధికంగా కేంద్రం అవార్డులు ఇచ్చి ఇక్కడ అభివృద్ధి లేదనడం మోదీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.







