Vizag Jagadeeswari : 90 లక్షల రూపాయలు మోసపోయానన్న నటి.. ఇంట్లో బియ్యం లేని పరిస్థితి అంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి వైజాగ్ జగదీశ్వరి( Vizag jagadeeswari ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె తెలుగులో ఒకటి రెండు కాదండోయ్ ఏకంగా 76 సీరియల్స్ లెక్కలేనన్ని సినిమాలు, మూడు వేలకు పైగా నాటకాలు చేసి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.

 Actress Vizag Jagadeeswari About Personal Life And Career-TeluguStop.com

వెండితెరపై తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.ఈమె సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 18 ఏళ్లు అవుతున్న కూడా ఇప్పటికీ పెద్దగా సంపాదించుకోలేదని కూడబెట్టుకోలేదని, ఉన్నది సంపాదించింది మొత్తం పోగొట్టుకున్నాను అని తెలిపింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జగదీశ్వరి తన కెరియర్ లో ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.

Telugu Actressvizag, Career, Personal, Yana Murth, Tollywood-Movie

కాగా ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ.నేను 30 ఏళ్ల వయసులో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాను.ఆర్‌.నారాయణమూర్తి( R.Narayana Murth ) గారితో 6 సినిమాలు చేశాను.ఒకసారి నా కొడుకు సినిమా అవకాశాల కోసం ఒక ఆఫీసుకు వెళ్లి అక్కడ నా ఫోటో చూపించాడు.

అక్కడున్న వ్యక్తి ఓహ్‌, ఈవిడా అమ్మాయిలను వెంటేసుకుని తిరిగే ఈమె మీ అమ్మగారా? నాతో అన్నావు కానీ బయట ఎక్కడా ఆమె మీ అమ్మ అన్న విషయం చెప్పకు అని అన్నాడట.చాలా కాలం తర్వాత నా కొడుకు ఈ విషయం చెప్పాడు.

ఎంతో బాధేసింది.కానీ నాకు వివాదాల జోలికి వెళ్లడం ఇష్టం ఉండదు.

వివాదాల్లో చిక్కుకుంటే తర్వాత నేను ఇండస్ట్రీలో ఇబ్బంది పడాల్సి వస్తుందని ఒక అడుగు వెనక్కే వేస్తాను.ఒకసారి మా ఇంట్లో దొంగలు పడి పాతిక లక్షల బంగారం పోయింది.

Telugu Actressvizag, Career, Personal, Yana Murth, Tollywood-Movie

మరోపక్క చిట్టీలు కట్టి దారుణంగా మోసపోయాను.మొత్తం రూ.90 లక్షల దాకా కోల్పోయాను.నేను తెచ్చుకుంది, ఇక్కడ సంపాదించి అంతా పోగొట్టుకున్నాను.

ఒకప్పుడు నెలకు 20 రోజులకు పైగా పనిచేసేదాన్ని.ఇప్పుడు సరిగా పని దొరకడం లేదు.

ఈ ఆరు నెలల్లో ఏవో కొన్ని సీరియల్స్‌, ఒక సినిమా చేశాను అంతే.ఆ సినిమాకు కూడా ఒకే ఒక రోజు పని చేశాను.

కానీ ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు.ఒకానొక సమయంలో ఇంట్లో బియ్యం కూడా లేదు.

సీరియల్స్‌ కూడా తక్కువ రోజులే చేశాను.దానికి కూడా సరిగా డబ్బులు ఇవ్వడం లేదు.వృత్తి పరంగానే కాకుండా వ్యక్తిగత విషయంలోనూ ఎన్నో ఇబ్బందులు పడ్డాను.నాకు 18 ఏళ్లున్నప్పుడు నా భర్త లారీ ప్రమాదంలో చనిపోయాడు.

అప్పటికి నాకు ఒక చిన్న బాబున్నాడు.పాప కడుపులో ఉంది.నా నటనను మెచ్చి ఒక లాయర్‌ నన్ను ఇష్టపడ్డాడు.25 ఏళ్లకు అతడిని రెండో పెళ్లి చేసుకున్నాను.కానీ అతడు జల్సాలు చేయడానికి నన్ను పెళ్లాడాడు.నువ్వు నేను సినిమా నేను చేయాల్సింది.మా ఆయన వల్లే ఆ అవకాశం చేజారింది.ఆ చిత్రం సూపర్‌ హిట్‌ అవడంతో ఆ తర్వాత తెలంగాణ శకుంతల( Telangana Sakuntala ) 400 సినిమాలు చేశారు, అంత బిజీ అయింది.

నా భర్త నన్ను వదిలేసి మరో పెళ్లి చేసుకున్నాడు.అప్పుడు నేను ఆత్మహత్యాయత్నం చేశాను.

ఇప్పటికీ చేతి మీద ఆ గుర్తులు ఉన్నాయి అంటూ కంటతడి పెట్టుకుంది వైజాగ్‌ జగదీశ్వరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube