గత కొంత కాలం నుండి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నలుమూలల ప్రతీ ఒక్కరు ప్రభాస్ నామస్మరణ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.‘ఆదిపురుష్( Adipurush )’ సినిమాతో మొదలైన ఈ ప్రభాస్ మేనియా, ‘సలార్’ సినిమాతో తారాస్థాయికి చేరుకుంది.సెప్టెంబర్ 28 వ తారీఖున గ్రాండ్ గా అన్నీ ప్రాంతీయ బాషలలో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రెండు రోజుల క్రితమే విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ టీజర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఎక్కడ చూసినా ఈ టీజర్ కి సంబంధించిన డైలాగ్ గురించే మాట్లాడుకుంటున్నారు.అంతలా ఫేమస్ అయ్యింది ఆ డైలాగ్.
ఇదంతా ‘సలార్’ సృష్టించబోతున్న సునామి కి ముందు వచ్చే సూచనలు అని అర్థం అవుతుంది.ఇక ఈ టీజర్ లో ప్రభాస్ లుక్ ని పూర్తి గా రివీల్ చెయ్యలేదని ఫ్యాన్స్ బాగా నిరాశకి గురుయ్యారు.

టీజర్ అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా ప్రభాస్ ని క్లోజ్ అప్ లో చూపించలేదని తెగ ఫీల్ ఐపోతున్నారు ఫ్యాన్స్.అయితే అలాంటి ఫ్యాన్స్ కి ఇప్పుడు ఒక శుభ వార్త.ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కట్ సిద్ధం అయిపోయిందట.వచ్చే నెల మూడవ వారం లో ట్రైలర్ ని విడుదల చేయబోతున్నట్టు సమాచారం.టీజర్ లో ప్రభాస్ క్లోజ్ అప్ షాట్స్ లేవని అభిమానులు ఎంత నిరాశకి గురయ్యారో, ట్రైలర్ చూసిన తర్వాత అంతకు పదింతలు ఎక్కువగా సంతృప్తి చెందుతారని, వింటేజ్ ప్రభాస్ మాస్ అంటే ఎలా ఉంటుందో మరొక్కసారి ఇండియన్ సినిమా కి తెలుస్తుందని అంటున్నారు మేకర్స్.బాహుబలి( Baahubali ) సిరీస్ తర్వాత ప్రభాస్ నటించిన ఒక్క సినిమాకి కూడా పాజిటివ్ టాక్ రాలేదు.
ఒకవేళ టాక్ వచ్చి ఉంటే విద్వంసం మామూలు రేంజ్ లో ఉండేది కాదు.డిజాస్టర్ టాక్స్ వచ్చినప్పటికీ కూడా ఆయన సినిమాలు ఇతర స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలతో సమానంగా వసూలు చేస్తున్నాయి.

అలాంటి స్టార్ స్టేటస్ మొత్తం వృధా అయిపోతుందని ఫ్యాన్స్ చాలా బాధపడుతూ ఉన్నారు.ఒక్క సూపర్ హిట్ కావలి అనే ఆకలి మీద ఉన్నారు.వాళ్ళ ఆకలికి తగ్గట్టుగానే ఈ ‘సలార్’( Salaar ) చిత్రం ఉండబోతుంది.ఇక ఈ సినిమా ట్రైలర్ లో ప్రభాస్ యాక్షన్ సన్నివేశాలను చూస్తే ఫ్యాన్స్ మెంటలెక్కిపోతారట.
ఇంత మాస్ గా రాజమౌళి లాంటి డైరెక్టర్ కూడా ప్రభాస్ ని చూపించలేదని ట్రైలర్ ని చూసిన ప్రతీ ఒక్కరు ఫీల్ అయ్యేలా చేస్తుందట.మరి ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉన్నాయి, ఇక ఆ రేంజ్ ట్రైలర్ కట్ పడితే ఇక ఏమైనా ఉందా!, ఆ అంచనాలను అందుకోవడం కూడా అసాధ్యమే, అందువల్ల ఈ చిత్రానికి కూడా మొదట్లో నెగటివ్ టాక్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు, మరి ప్రశాంత్ నీల్( Prashanth Neel ) ఎలా మ్యానేజ్ చేస్తాడో చూడాలి.







