సోయా బీన్స్ అనగానే దాదాపు అందరికీ వైట్‌వే గుర్తుకు వస్తుంటాయి.కానీ, బ్లాక్ సోయా బీన్సూ ఉంటాయి.
వైట్‌తో పోల్చుకుంటే బ్లాక్ సోయా బీన్స్‌లో పోషకాలూ ఎక్కువే.ప్రయోజనాలూ ఎక్కువే.
అవును, సోయా బీన్స్‌లో కాల్షియం, ఊరన్, పొటాషియం, ఫాస్పరస్, సోడియం, జింక్, మెగ్నీషియం, విటమిన్ ఎ, విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఇలా ఎన్నో పోషక విలువలు నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్యానికి బ్లాక్ సోయా బీన్స్ చాలా మేలు చేస్తాయి.
మరి లేటెందుకు బ్లాక్ సోయా బీన్స్ అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూసేయండి.అధిక రక్త పోటు బాధితులకు బ్లాక్ సోయా బీన్స్ ఓ వరంగా చెప్పుకోవచ్చు.
బ్లాక్ సోయా బీన్స్ లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.అందు వల్ల, వీటిని తరచూ తీసుకుంటే అధిక రక్త పోటు స్థాయిలో అదుపులోకి వస్తాయి.
బ్లాక్ సోయా బీన్స్‌ను తీసుకోవడం వల్ల ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.దీంతో కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు దరి చేరకుండా ఉంటాయి.అలాగే రక్త హీనత వ్యాధితో ఇబ్బంది పడే వారు బ్లాక్ సోయా బీన్స్‌ను డైట్‌లో చేర్చుకుంటే రక్త వృద్ధి జరుగుతుంది.ఫలితంగా రక్త హీనత పరార్ అవుతుంది.
అంతేకాదు, బ్లాక్ సోయా బీన్స్‌ను తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతుంది.అల్జీమర్స్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.
మలబద్ధం నుంచి విముక్తి లభిస్తుంది.వెయిట్ లాస్ అవుతాయి.
ఇక మధుమేహం వ్యాధి గ్రస్తులు బ్లాక్ సోయా బీన్స్‌ను డైట్‌లో చేర్చుకుంటే.రక్తంలో చక్కెర స్థాయిలు గాడి తప్పకుండా ఉంటాయి.
మరియు శరీరంలో ప్రోటీన్ కొరత ఏర్పకుండా ఉంటుంది.కాబట్టి, బ్లాక్ సోయా బీన్స్‌ను కూడా ఆహారంలో భాగంగా చేర్చుకునేందుకు ప్రయత్నించండి.