వస్త్ర పరిశ్రమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం - కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు.సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ యజమానులు, ఆసాములతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని ఆడిటోరియంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

 Will Bring The Problem Of Textile Industry To The Attention Of The Government Co-TeluguStop.com

అనంతరం కలెక్టర్ మాట్లాడారు.ప్రభుత్వ నిబంధనలు, ఆదేశాల మేరకు ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు పవర్ సబ్సిడీ కొనసాగించాలని పవర్ లూమ్ యజమానులు, ఆసాములు విజ్ఞప్తి చేశారు.గతంలో ఇచ్చిన విధంగా ఇవ్వాలని, ప్రభుత్వం నుంచి వస్త్ర పరిశ్రమకు ఆర్డర్లు ఇప్పించాలని కోరారు.

అనంతరం సెస్ చైర్మన్ చిక్కాల రామారావు మాట్లాడారు.హైకోర్టు కేసు, ఆర్ఈసీ ఆదేశాల మేరకు 10 హెచ్ పీ వరకు సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు.

ఈ సమావేశం లో టెక్స్ టైల్స్ అండ్ హ్యాండ్లూమ్ ఏడీ సాగర్, సెస్ ఎండీ రవీందర్ రెడ్డి, డైరెక్టర్ దార్నం లక్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube