రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల పరిధిలో మద్యం తాగి పట్టుబడిన ఆరుగురు వాహనదారులకు ఐదుగురికి రూ.1000 చొప్పున, ఒక్కరికీ రూ.2000 చొప్పున వేములవాడ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కావేటి సుజన జరిమానా విధించడం జరిగిందని రుద్రంగి ఎస్ఐ సిరిసిల్ల అశోక్ వెల్లడించారు.
మద్యం తాగి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైన వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, మద్యం మత్తులో వాహనము నడిపి ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు వాహనానికి ప్రమాద బీమా కూడా వర్తించదని వెల్లడించారు.