స్టార్ హీరో రామ్ చరణ్ పై అభిమానంతో పాదయాత్ర చేస్తున్న అభిమాని.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కు( Ram Charan ) ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.చిరంజీవి అభిమానులు చరణ్ ను ఎంతో అభిమానిస్తుండగా చరణ్ యాక్టింగ్ స్కిల్స్ కు సైతం సొంతంగా అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే.

 Star Hero Ram Charan Express His Effection On His Favoruite Hero Details, Ram Ch-TeluguStop.com

చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్( Game Changer ) సినిమాతో బిజీగా ఉండగా ఈ నెలాఖరున ఈ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ అవుతుందని ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న థమన్ వెల్లడించారు.

గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలం అవుతున్నా శంకర్ ఇండియన్2, ఇండియన్3 సినిమాలలో బిజీ కావడం వల్ల ఈ సినిమా అంతకంతకూ ఆలస్యమైంది.

శంకర్ ఇప్పటికైనా గేమ్ ఛేంజర్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెడితే ఈ సినిమా అనుకున్న విధంగా రిలీజవుతుంది.నెల రోజుల గ్యాప్ లో మూడు మెగా సినిమాలు రిలీజ్ కానుండటం ఫ్యాన్స్ ను ఒకింత కంగారు పెడుతోంది.

అయితే రామ్ చరణ్ వీరాభిమాని( Ram Charan Fan ) ఒకరు చరణ్ పై అభిమానాన్ని చాటుకోగా ఆ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ వరకు మెగాస్టార్ అన్నయ్య కోసం పాదయాత్ర అంటూ చరణ్ అభిమాని అయిన వి.రాజు( V Raju ) పాదయాత్ర చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలను చూసి మెగా ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు.

రామ్ చరణ్ తండ్రికి తగ్గ కొడుకు అని ఈ అభిమాని చెప్పుకొచ్చారు.చరణ్ న్యాచురల్ గా యాక్ట్ చేస్తాడని ఆయన తెలిపారు.చరణ్ రంగస్థలం, ఆర్.ఆర్.ఆర్ సినిమాలను 200 సార్లు చూశాడని వి.రాజు పేర్కొన్నారు.చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చరణ్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నానని ఆయన తెలిపారు.చరణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని రేంజ్ లో పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube