సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) ఇప్పటిదాకా డైరెక్ట్ చేసింది రెండే సినిమాలు కానీ ఇండియా లెవెల్ లో అతడు స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.అతడు తీసిన అర్జున్ రెడ్డి సినిమా( Arjun Reddy ) ఇండియాని షేక్ చేసింది.
ఈ మూవీతో విజయ్ దేవరకొండ లైఫ్ సెట్ అయిపోయింది.దీని తర్వాత అతను తీసిన యానిమల్ మూవీ( Animal Movie ) రూ.917 కోట్లు కలెక్ట్ చేసి సన్సేషనల్ హిట్ సాధించింది.అయితే ఫస్ట్ హిట్ సాధించడానికి ముందు సందీప్ రెడ్డి వంగా మూవీ ఇండస్ట్రీలో చాలా చిన్నచిన్న పనులు చేశాడంటే నమ్ముతారా?
అర్జున్ రెడ్డి కి ముందు అతడు 3 సినిమాల కోసం చిన్న పనులు చేశాడు.సందీప్ సినిమా రంగంలోకి అడుగు పెట్టిన కొత్తలో 2005లో “మనసు మాట వినదు”( Manasu Matavinadhu ) అనే సినిమాకి అప్రెంటీస్ గా పని చేశాడు.ఈ సినిమా షూటింగ్‌ను విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ వద్ద కంప్లీట్ చేయడం జరిగింది.
సందీప్ ఈ చిన్న సినిమా కోసం ఏకంగా 25 రోజులు పాటు వర్క్ చేశాడు.
ఆ తర్వాత, సందీప్ కేడి మూవీ( Kedi Movie ) కోసం వర్క్ చేశాడు.ఈ సినిమా డైరెక్టర్ కిరణ్ కుమార్ కింద అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి దర్శకత్వం ఎలా చేస్తారో తెలుసుకున్నాడు.ఆ తర్వాత ఈ డైరెక్టర్ “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు”( Malli Malli Idi Rani Roju ) సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశాడు.
క్రాంతి మాధవ దీనికి డైరెక్టర్.అనంతరం సందీప్ తన మొదటి సినిమాగా షుగర్ ఫ్యాక్టరీ అనే కథ రాశాడు.కానీ ఆ కథను పూర్తిగా చెత్తలో పడేశాడు.ఆపై అర్జున్ రెడ్డి అనే కొత్త కథ రాశాడు.
సందీప్ అర్జున్ రెడ్డి అనే సినిమా కథను 2013లో రాసారు.ఈ కథను రాయడానికి ఆయనకు రెండేళ్లు పట్టింది.ఈ కథను స్వప్న దత్ అనే నిర్మాత, శర్వానంద్ అనే హీరో చాలా ఇష్టపడ్డారు.శర్వానంద్ ఈ సినిమాలో యాక్ట్ చేయాలని కూడా అనుకున్నాడు.కానీ ఆ సమయంలో శర్వానంద్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి ఈ సినిమా ఆయన చేతిలో నుంచి జారిపోయింది.2017 ఆగస్టు 25న కేవలం 4-5 కోట్ల రూపాయల బడ్జెట్‌తో అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయింది.ఈ సినిమా 50 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి చాలా లాభాలు తెచ్చి పెట్టింది.
సందీప్ మూడు సినిమాల్లో కూడా నటుడుగా కనిపించాడు.
కెడి (2010)లో బోట్‌లో ఉన్న ఒక వ్యక్తిగా నటించాడు.మహానటి (2018)లో వేదాంతం రాఘవయ్య పాత్రను సందీప్ పోషించాడు.
అంతేకాదు అనిమల్ సినిమాలో “అజీజ్ హక్” అనే ఒక రోల్‌కి వాయిస్ అందించాడు.