వైరల్ వీడియో: వ్యూస్ కోసం యూట్యూబర్ రైల్వే ట్రాక్ పై ఏకంగా..?

చాలామంది సోషల్ మీడియా( Social media )లో ఫేమస్ అయ్యే కొరకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉండడం, అందుకోసం ఏకంగా అనేక సాహసాలు చేయడం మనం చూస్తూనే ఉంటాం.సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు వారి ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా సాహసాలు చేసి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు మనం చాలానే చూస్తూనే ఉంటాం.

 Viral Video Youtuber On Railway Track For Views , Youtuber ,gulzar Sheikh, Arr-TeluguStop.com

ఇటీవల ఒక వ్యక్తి కూడా ప్రమాదకరమైన స్టంట్ చేస్తూ కాళ్లు, చేతులు పోగొట్టుకున్న సంగతి కూడా తెలిసిందే.ఇక మరికొందరు అయితే సోషల్ మీడియాలో తమ వీడియోలకు ఎక్కువగా వ్యూస్ రావాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉండడం మనం గమనించవచ్చు.

అచ్చం అలాగే తాజాగా ఉత్తరప్రదేశ్ ( Uttar Pradesh )కు చెందిన ఒక యూట్యూబర్ రైల్వే ట్రాక్ పై దుశ్చర్యకు పాల్పడి చాలా ప్రమాదకరమైన వీడియోలను చేసాడు.

రైల్వే ట్రాక్( Railway track ) పై రాళ్లు, గ్యాస్ సీలిండెర్స్, సైకిల్, బతికున్న కోడిని లాంటివి ఉంచి వాటిపై రైలు వెళ్తే ఏం జరుగుతుందో అనేది వీడియోలో మీకు చూపిస్తాను అంటూ వీడియోను చూపించడం మనం గమనించవచ్చు.అయితే., ఈ యూట్యూబర్ చేసిన తీరుకు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

అంతేకాకుండా కొంతమంది నెటిజన్స్ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక మరికొందరు ఆ యూట్యూబర్ పై కొందరు రైల్వే పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయగా.

వారు వెంటనే స్పందించి ఆ యూట్యూబర్ చేసిన వికృత పనిని సీరియస్ గా తీసుకొని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇకపోతే, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడం. రైల్వే ట్రాక్లు ద్వంశం చేసేలాగా ట్రాక్స్ పై రాళ్లు, సిలిండర్లు పెట్టి వీడియోలు చేస్తున్నందుకు యూట్యూబర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఇలాంటి చేసేవారు ఎవరైనా సరే.ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఊరుకునేది లేదు అంటూ పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube