సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ డైరెక్టర్ కావడం అంత సులభమైన పనేం కాదు.స్టార్ డైరెక్టర్ అవ్వాలంటే మూవీల పట్ల విపరీతమైన ఇంట్రెస్ట్ ఉండాలి.
అద్భుతమైన దర్శకత్వ నైపుణ్యాలు కలిగి ఉండాలి.కథను అందరికీ అర్థమయ్యేలా, చాలా ఇంట్రెస్టింగ్ గా మలచాల్సిన ప్రతిభ కూడా చాలా అవసరం.
నటీనటులను ఎంచుకోవడం నుంచి పాటలు, కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ ఇవన్నీ కూడా పండించగలగాలి.స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాలు తీసి హిట్స్ కొట్టడం కొద్దిగా ఈజీ ఏమో కానీ స్టార్ హీరో లేకుండా ఓన్లీ మంచి స్టోరీలతోనే హిట్ కొట్టడం అంటే చాలా కష్టం.
ఎంటైర్ కెరీర్లో ఒక్క స్టార్ హీరోతో కూడా సినిమా చేయకుండా అన్నీ హిట్స్ సాధించాడు అంటే అతను ఒక గొప్ప డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు.అలాంటి డైరెక్టర్లు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు.
వారిలో శేఖర్ కమ్ముల( Sekhar Kammula ) ఒకరు.ఫస్ట్ మూవీ “ఆనంద్”తోనే పెద్ద హిట్ అందుకున్నాడు శేఖర్.
ఫ్యామిలీలు చూసేలాగా ఈ దర్శకుడి సినిమాలు ఉంటాయి.అదే సమయంలో కుర్ర కారుకు నచ్చేలాగా కూడా శేఖర్ కమ్ముల తన సినిమాలను తీస్తాడు.
ఉదాహరణకు హ్యాపీడేస్,( Happy Days ) ఫిదా,( Fidaa ) లవ్ స్టోరీ, గోదావరి, ఆవకాయ బిర్యాని లాంటి సినిమాలను చెప్పుకోవచ్చు.
అతను మాములు హీరోలతో సినిమాలు తీసే స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు.చివరికి ఒక స్టార్ హీరోతో అతడు ఓ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.అది కూడా పర భాష హీరోతో కావడం విశేషం.
ఆ హీరో మరెవరో కాదు నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్.( Dhanush ) ఈ హీరోతో తీస్తున్న సినిమా పేరు కుబేర.
( Kubera ) ఇందులో అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) కూడా యాక్ట్ చేస్తున్నాడు.ఈ మూవీ సూపర్ హిట్ అయితే శేఖర్ కమ్ముల రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది.
కుబేర మూవీ షూటింగ్ 60% పూర్తయినట్లు సమాచారం ఇంకో 40 పర్సెంట్ కంప్లీట్ అయితే ఇది తెలుగులో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
శేఖర్ కమ్ముల తీసే సినిమాలన్నీ కూడా మనసును హత్తుకుంటాయి.అవి ఒక్కసారి చూసినా చాలా రోజులు మనకి గుర్తుండిపోతాయి.ఆయన సినిమాలోని పాత్రలు మన మీద లాంగ్ లాస్టింగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాయి.
ఉదాహరణకి భానుమతి.ఈ దర్శకుడు తీసే ప్రతి సినిమా కూడా విభిన్నంగా ఉంటుంది.
లీడర్ సినిమా చూస్తే అతని ఎంత టాలెంటెడ్ డైరెక్టరో అర్థమవుతుంది.వంక పెట్టడానికి ఏమీ లేకుండా శేఖర్ కమ్ముల సినిమాలు పర్ఫెక్ట్ గా ఉంటాయి.
ఇతని సినిమాలోని హీరోయిన్ క్యారెక్టర్స్ బాగా ఆకట్టుకుంటాయి.ఇక పాటలు గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.