టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా మంచి కథలకు ప్రాధాన్యత ఇస్తున్న హీరోలలో అల్లు శిరీష్( Allu Sirish ) ఒకరు.శ్రీరస్తు శుభమస్తు, ఊర్వశివో రాక్షసివో సినిమాలతో హిట్లు అందుకున్న అల్లు శిరీష్ ఈరోజు బడ్డీ సినిమాతో( Buddy Movie ) ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
బడ్డీ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వస్తుండగా కమర్షియల్ గా ఈ సినిమా ఫలితం ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.
అల్లు శిరీష్ తాజాగా ఒక సందర్భంలో మాట్లాడుతూ నేను ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయడానికి ఇష్టపడనని పేర్కొన్నారు.
ఒక సినిమా తర్వాత మరో సినిమా చేయడానికి నేను ఆసక్తి చూపిస్తానని ఆయన తెలిపారు.ఈ రీజన్ వల్లే నా సినిమాలు కొంచెం ఆలస్యంగా థియేటర్లలోకి వస్తున్నాయని అల్లు శిరీష్ వెల్లడించారు.
బడ్డీ కథ కొత్తగా అనిపించిందని అందుకే ఈ సినిమాలో నటించానని శిరీష్ పేర్కొన్నారు.
బడ్డీ సినిమా టెడ్డీకి( Teddy ) రీమేక్ అని చాలామంది ఫీలవుతున్నారని ఆ వార్తలు నిజం కాదని ఇది స్ట్రెయిట్ తెలుగు సినిమా అని శిరీష్ చెప్పుకొచ్చారు.మేము ఎంత చెప్పినా కొంతమంది రీమేక్( Remake ) అని కామెంట్లు చేస్తున్నారని వాళ్ల అభిప్రాయాలను మార్చలేమని శిరీష్ చెప్పుకొచ్చారు.గతేడాది ఈ సినిమా రిలీజ్ కావాలని గ్రాఫిక్స్ షాట్స్ వల్ల ఈ సినిమా ఆలస్యమైందని ఆయన కామెంట్లు చేశారు.
బడ్డీ మూవీని కథగా చెప్పాలంటే హీరో పైలట్ అని హీరోయిన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అని అల్లు శిరీష్ చెప్పుకొచ్చారు.జ్ఞానవేల్ రాజా ఈ సినిమాకు సంబంధించి ఖర్చు విషయంలో రాజీ పడలేదు.వేస్ట్ ప్రొడక్షన్ వల్ల కలిగే బాధ నాకు తెలుసని అలాంటి వృథా ఖర్చును నేను ప్రోత్సహించనని అల్లు శిరీష్ వెల్లడించారు.అల్లు శిరీష్ రెమ్యునరేషన్ తక్కువగానే ఉందని సమాచారం అందుతోంది.