బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు దివంగత నటి శ్రీదేవి( Sridevi ) వారసురాలు నటి జాన్వీ కపూర్( Janhvi Kapoor ).ధడక్ సినిమా ద్వారా హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు.
ఇదివరకు బాలీవుడ్ సినిమాలలో నటించిన జాన్వీ కపూర్ త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా రావడానికి సిద్ధమవుతున్నారు ప్రస్తుతం ఎన్టీఆర్( NTR ) హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో( Devara Movie ) ఈమె హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.
కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది.ఈ క్రమంలోనే సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.ఇదిలా ఉండగా నటి జాన్వీ కపూర్ బాలీవుడ్ లో నటించిన ఉలగ్ సినిమా( Ulajh Movie ) ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
తాను సినిమాల పరంగా ఎంత కష్టమైనా భరిస్తాను నా పాత్ర కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాను కానీ ఒక పని మాత్రం అస్సలు చేయనని తెలిపారు.
నా పాత్ర నా కెరియర్ ను పూర్తిగా మలుపు తిప్పుతుందనీ చెప్పినా కూడా నేను నా జుట్టును ( Hair ) మాత్రం అసలు కత్తిరించనని తెలిపారు.ఇలా జుట్టు కత్తిరించే పాత్ర ఎలాంటిదైనా సరే తాను చేయనని ఒకవేళ విఎఫ్ఎక్స్ లో సరి చేసుకుంటే పర్వాలేదు కానీ జుట్టు కత్తిరించాలి అంటే మాత్రం తాను ఆ సినిమా నుంచి తప్పుకుంటాను కానీ జుట్టు మాత్రం కత్తిరించనని తెలిపారు.ఎందుకంటే నా జుట్టు అంటే మా అమ్మకు చాలా ఇష్టం నేను జుట్టు కట్ చేస్తే అమ్మకు చాలా కోపం వస్తుంది.
ధడక్ సినిమా సమయంలో తాను జుట్టు కత్తిరిస్తే అమ్మ ఇంకోసారి ఇలా చేయొద్దు అంటూ నన్ను తిట్టిందని అందుకే నేను నా జుట్టును కత్తిరించను అంటూ జాన్వీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.