భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్న ఎన్ఆర్ఐలు.. ఐదేళ్లలో ఎంత మందో తెలుసా..?

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు అక్కడే స్థిరపడుతుండటంతో తమ భారత పౌరసత్వాన్ని( Indian Citizenship ) వదులుకుని అక్కడి పౌరులుగా వుండేందుకే ఇష్టపడుతున్నారు.ఈ నేపథ్యంలో గతేడాది 2,16,000 మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్( Kirti Vardhan Singh ) ఈ మేరకు పార్లమెంట్‌కు లిఖితపూర్వకంగా తెలియజేశారు.2011 నుంచి 2018తో పాటు గడిచిన ఐదేళ్లలో పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయుల సంఖ్యను ఆయన వివరించారు.

 Over 2 Lakh Indians Gave Up Their Citizenship And Moved Abroad In 2023 Details,-TeluguStop.com
Telugu Indians, Eamkirti, Indian, Moved, Nris, Raghav Chadha, Arab Emirates-Telu

2023లో 2,16,219 మంది .2022లో 2,25,620 మంది.2021లో 1,63,370 మంది.2020లో 85,256 మంది.2019లో 1,44,017 మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు.ఈ సందర్భంగా ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా( Raghav Chadha ) ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు.పెద్ద సంఖ్యలో భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకోవడం వెనుక కారణాలను ప్రభుత్వం పరిశోధించిందా, ఆర్ధిక , మేధోపరమైన నష్టాలను అంచనా వేసిందా అని ప్రశ్నించారు.

దీనికి మంత్రి కీర్తి వర్ధన్ తనదైనశైలిలో ఆన్సర్ ఇచ్చారు.పౌరసత్వాన్ని వదులుకోవడం లేదా పొందడం అనేది వ్యక్తిగత విషయమని, నేటి నాలెడ్జ్ ఎకానమీలో గ్లోబల్ వర్క్‌ఫోర్స్ అందించిన అవకాశాలను ప్రభుత్వం గుర్తిస్తోందన్నారు.

Telugu Indians, Eamkirti, Indian, Moved, Nris, Raghav Chadha, Arab Emirates-Telu

ఇదే సమయంలో భారతదేశం 2024లో భారీ ఎత్తున మిలియనీర్ల వలసలను చూడబోతోందా అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.జూన్‌లో విడుదలైన హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్డ్ 2024లో . భారత్ ఈ ఏడాది 4,300 మంది మిలియనీర్లను వదులకోనుందని పేర్కొంది.ఇది 2023తో (5,100) పోల్చితే తగ్గినప్పటికీ.

ప్రపంచవ్యాప్తంగా అధిక నికర విలువ గల వ్యక్తిగత నిష్క్రమణలను ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)( United Arab Emirates ) భారతీయ మిలియనీర్లకు అనుకూలమైన గమ్యస్థానంగా నిలుస్తోంది.2024లో రికార్డు స్థాయిలో 6700 మంది మనదేశానికి చెందిన సంపన్నులు ఆ దేశానికి వలస వెళ్తారని అంచనా.ఆదాయపు పన్ను లేకపోవడం, గోల్డెన్ వీసా ప్రోగ్రామ్, విలాసవంతమైన జీవనశైలి వంటి అంశాలతో యూఏఈ భారతీయులను ఎక్కువగా ఆకర్షిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube