వంద రూపాయలకే కల్కి మూవీని థియేటర్లలో చూసే ఛాన్స్.. ఆ తప్పు మాత్రం చేయొద్దంటూ?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి.నాగ్ అశ్విన్ ( Nag Ashwin )దర్శకత్వం వహించిన కల్కి సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

 Kalkirs 100 No Where In Hyderabad Multiplexes, Kalki Movie , Hyderabad, Ticket-TeluguStop.com

దాదాపుగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించడంతో పాటు ఇప్పుడు మరిన్ని కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతోంది.ఈ సినిమా భారీ విజయం సాధించడంతో చిత్ర బృందం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

డార్లింగ్ ప్రభాస్ కూడా ఒకవైపు ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే తదుపరి సినిమాలో షూటింగ్లలో బిజీ బిజీ అవుతున్నారు.

ఇకపోతే ఈ సినిమా మంచి సక్సెస్ సాధించిన సందర్భంగా తాజాగా అభిమానులకు లాంటి వార్తను తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేసింది చిత్ర బృందం.థ్యాంక్యూ అనేది చాలా చిన్న పదం.ఈ వారం ప్రేక్షకులకు అభినందనలు చెబుతున్నాము.కల్కి సినిమాను వంద రూపాయలకే ఎంజాయ్ చేయండి.ఆగస్ట్ 2 నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా అంటూ కల్కి టికెట్ రేట్లను తగ్గించినట్టు ఘనంగా ప్రకటించింది చిత్ర.

యూనిట్.దీంతో మరోసారి కల్కి సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయొచ్చని చాలామంది సంబరపడ్డారు.

కానీ బుక్ మై షో ఓ( BookMyShow )పెన్ చేసి చూసిన జనాలకు ఆ ఆనందం నిమిషాల్లో ఆవిరైంది.హైదరాబాద్ విషయానికొస్తే…

దాదాపు 80 శాతం మల్టీప్లెక్స్ స్క్రీన్స్ లో కల్కి టికెట్ రేట్లలో తగ్గుదల కనిపించలేదు.మరీ వంద రూపాయలకు టికెట్ ఏంటని భావించారేమో కొన్ని మల్టీప్లెక్సుల్లో టికెట్ రేటును 250 చేశారు, మరికొన్నింటిలో 150, ఇంకొన్నింటిలో 110 చేశారు.అంతే తప్ప ఏ మల్టీప్లెక్సులో వంద రూపాయల టికెట్ రేటు కనిపించలేదు.

ఏషియన్ ఛెయిన్ లో సింగిల్ స్క్రీన్స్ లో చెప్పినట్టుగానే వంద రూపాయలు చేశారు.మల్టీప్లెక్స్ స్క్రీన్స్ కొన్నింటిలో 250 రూపాయలు టికెట్ కనిపించగా, మరికొన్నింటిలో మాత్రం 110 రూపాయలు కనిపించింది.

పీవీఆర్ ఛెయిన్ లో కూడా ఇదే పరిస్థితి కావడం విషెషం.సినీపొలిస్ కూడా ఇదే దారిలో పయనించగా ఐనాక్స్ లో మాత్రం కేవలం ఒకే ఒక్క స్క్రీన్ లో 110 రూపాయల టికెట్ కనిపించింది.

మిగతా అన్ని స్క్రీన్స్ లో గరిష్ఠంగా 350 రూపాయలే ఉంచారు.ఇక ఏఎంబీలో రీక్లయినర్స్ మినహా మిగతావన్నీ ఫ్లాట్ 150 చేశారు.ఇక ప్రసాద్ మల్టీప్లెక్స్ లో కూడా టికెట్ రేట్లు తగ్గలేదు.కాబట్టి సినిమా ధియేటర్లకు వెళ్లే వాళ్ళు గుడ్డిగా అలాగే వెళ్లకుండా సినిమా థియేటర్లలో టికెట్లు రేట్లు కనుక్కొని వెళ్లడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube