నా కొడుకు చావుకు వాళ్లే కారణం... ఎమోషనల్ అయినా గీతూ రాయల్?

టిక్ టాక్ వీడియోల ద్వారా ఎంతో ఫేమస్ అయ్యి అనంతరం బిగ్ బాస్( Bigg Boss ) రివ్యూలు ఇస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న వారిలో గీతూ రాయల్( Geethu Royal ) ఒకరు.ఇక బిగ్ బాస్ 6 కార్యక్రమంలో పాల్గొన్న ఈమె 9వ వారం ఊహించని విధంగా హౌస్ నుంచి బయటకు వచ్చేసారు.

 Geethu Royal Emotional About Her Pet Oreo Death Details, Oreo,geethu Royal,bigg-TeluguStop.com

ఇలా ఉన్నఫలంగా ఎలిమినేట్ కావడంతో ఎంతో ఎమోషనల్ అయ్యారు అలాగే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో బజ్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.ఇలా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటే ఎంత ఫేమస్ అయిన గీతూ తాజాగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేశారు.

తన కొడుకు మరణించారంటూ ఈమె ఎంతో ఎమోషనల్ అయ్యారు అయితే ఈమె పెళ్లి చేసుకొని కొన్ని సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు తనకు సంతానం లేకపోయినా ఓరియో( Oreo ) అనే ఒక పిల్లిని( Cat ) పెంచుతున్నట్లు పలు సందర్భాలలో వెల్లడించారు.అది నా కొడుకు కంటే ఎక్కువ అదే నా ప్రపంచం అంటూ తన పిల్లి గురించి ఈమె పలు సందర్భాలలో వెల్లడించారు.అయితే తాజాగా తన ఓరియో మరణించినట్లు గీతూ ఒక వీడియోని షేర్ చేశారు.గత కొద్దిరోజులుగా తన ఓరియో అనారోగ్యంతో బాధపడుతోందని వెల్లడించారు.

జూలై 24 ఉదయాన్నే ప్రతిరోజు లాగే కమ్యూనిటీలో తిరగడానికి వెళ్ళాడు.ఉదయం 5.30 లోపు తిరిగి వచ్చేస్తాడు.కానీ ఆ రోజు మాత్రం తిరిగి రాకపోవడంతో సాయంత్రం వరకు మేము దానికోసం వెతికామని తెలిపారు.

తర్వాత తెలిసింది.ఓరియో మా కమ్యూనిటీ వెనుకే చనిపోయాడని.

మా సెక్యూరిటీ గార్డ్స్ నిర్లక్ష్యం వల్ల కొన్ని వీధి కుక్కలు మా కమ్యూనిటీ లోకి వచ్చి ఓరియోపై దాడి చేశాయని ఆ దాడిలోనే అది చనిపోయిందని, నా కొడుకు చావుకు కారణం సెక్యూరిటీ అంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.అలా ఊర కుక్కలు తనపై దాడి చేసినప్పుడు అది ఎలాంటి భయానికి గురి అయిందో నేను ఊహించుకోగలను అంటూ ఈమె ఎమోషనల్ అవుతూ ఆ పిల్లికి దహన సంస్కారాలు చేస్తున్నటువంటి వీడియోని షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube