పాన్ ఇండియా స్టార్ హీరో రామ్ చరణ్ ( Ramcharan ) ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈయన మూడు పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టారు.
ఇక త్వరలోనే శంకర్ ( Shankar ) దర్శకత్వంలో దిల్ రాజు ( Dil Raju ) నిర్మాణంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న గేమ్ ఛేంజర్( Game Changer ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఈ సినిమా ఇప్పటికీ విడుదల కావాల్సిందిగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది.
ఇక ఈ సినిమాని డిసెంబర్లో విడుదల చేయబోతున్నట్లు ఇటీవల నిర్మాత దిల్ రాజు ఓ కార్యక్రమంలో వెల్లడించారు.
ఇక ఈ సినిమా విషయంలో అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ ఈ సినిమా గురించి సరైన అప్డేట్స్ తెలియజేయకపోవడంతో కొంతమేర నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా ఇటీవల శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు 2 సినిమా ఘోరంగా డిజాస్టర్ కావడంతో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో కూడా అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ఇలాంటి తరుణంలోనే ఈ సినిమా గురించి నటుడు రాజీవ్ కనకాల( Rajeev Kanakala ) చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ.భారతీయుడు 2 కథ వేరు గేమ్ ఛేంజర్ కథ వేరు.ఈ కథలో డ్రామాతో పాటు పూర్తీ కమర్షియల్ గా సినిమా ఉంటుంది.ఇక పాటలు విషయానికి వస్తే, ఒక్కో పాటని 10-12 కోట్ల ఖర్చుతో తీశారు.మేము అయితే మూవీ మీద చాలా నమ్మకంతో ఉన్నాము తప్పకుండా అందరికీ నచ్చుతుంది.ఇక ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ ఏంటంటే రామ్ చరణ్.
ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా స్టార్ గా సక్సెస్ అయ్యారు.ఈయన సినిమాలో కనిపిస్తే చాలు కాసుల వర్షం కురుస్తుంది.
ఒక్క మాటలో చెప్పాలి అంటే రామ్ చరణ్ శంకర్ కి దొరికిన ఒక గొప్ప నిధి అంటూ రాజీవ్ కనకాల కామెంట్స్ చేయటంతో సినిమాపై కాస్త అంచనాలు పెరుగుతున్నాయి.