ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక అద్భుతమైన వీడియో వైరల్‌గా మారింది.ఈ వీడియోను ‘వైల్డ్‌లైఫ్ అన్సెన్సర్డ్’( Wildlife Uncensored ) అనే ట్విటర్ అకౌంట్ పోస్ట్ చేసింది.
ఈ వీడియోలో జాగ్వార్( Jaguar ) అనే ఓ బిగ్ క్యాట్ ఒక పెద్ద ఎలిగేటర్‌తో పోరాడుతోంది.ఈ మొసలి ఆ పులిని నీళ్లలోకి లాక్కెళ్లాలని ప్రయత్నిస్తుంది.
కానీ, పులి తన బలంతో మొసలిని ఎదిరించి బతికింది.ఈ వీడియోను చాలా మంది చూశారు.
ఆ వీడియోలో, ఒక జాగ్వార్ నది ఒడ్డున తిరుగుతున్నప్పుడు, అకస్మాత్తుగా ఒక పెద్ద మొసలి నీటిలో నుంచి వచ్చి జాగ్వార్ తోకను నోట కరచుకుంది.దాంతో పులి షాక్ అవుతుంది.మొసలి జాగ్వార్‌ను నీళ్లలోకి లాక్కెళ్లాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది.బురద గుంతలోకి పులిని కొద్ది దూరం ఈడ్చుకెళ్తుంది కూడా.కానీ పులి చాలా బలమైన జంతువు, అది అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోదు.అయితే వీడియో చూస్తున్నంత సేపు అది మొసలిని ఎదిరించి బతికిందా లేదా అని టెన్షన్ పుట్టక మానదు.
మొసలి ,పులి( Crocodile, tiger ) తోకను గట్టిగా పట్టుకున్నా, పులి తన బలమైన కాళ్లతో మొసలిని తన్ని, తనను దాని అదుపులోకి తీసుకోకుండా ప్రయత్నిస్తుంది.ఈ పెద్ద మృగాలు ఒకదాన్నినొకటి బలంగా లాక్కున్నాయి.చివరికి పులి కాళ్లతో ఒడ్డు మీద పట్టు సాధించి మొసలి నుంచి తప్పించుకుంది.చివరి క్షణంలో తన శక్తిని మొత్తం ఉపయోగించి, అది నీటి ఒడ్డునకు ఎక్కి బతికింది.
మొసలి మాత్రం ఎంప్టీ హ్యాండ్ తో వెనుదిరిగింది.అప్పటికే జాగ్వార్ తాకకు బాగా గాయాలైనట్లు తెలిసింది అది బురదలో పడటం వల్ల మొత్తం నల్లగా తయారయ్యింది.
ఈ వీడియో చాలా మందికి షాక్ ఇచ్చింది.అడవిలో ఇలాంటి క్రూరమైన ఎన్నో సంఘటనలు జరుగుతాయని చాలామంది కామెంట్ చేస్తున్నారు.