సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి కీర్తి సురేష్ ( Keerthi Suresh ) ఒకరు.ఈమె ప్రస్తుతం తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా సౌత్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు.ఇక ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ నాని( Nani ) తో కలిసి రెండు సినిమాలలో నటించారు.
ఈ రెండు సినిమాలు కూడా చాలా మంచి సక్సెస్ అయ్యాయి.ఇక త్వరలోనే తమిళ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న కీర్తి సురేష్ నాచురల్ స్టార్ నాని గురించి పలు విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ హైదరాబాద్ వస్తే తప్పకుండా నేను నాని ఇంటికి వెళ్లి తిరిగి చెన్నై వెళ్లిపోతానని తెలిపారు.నాని ఇంట్లో నాకు ఎంతో ఫ్రీడమ్ ఉంది స్వయంగా వారి ఇంటికి వెళ్లి నేనే నాకు కావాల్సింది చేసుకొని తింటానని తెలిపారు.నాని మాత్రమే కాకుండా అంజన( Anjana ) కూడా నాకు చాలా మంచి ఫ్రెండ్ అని తెలిపారు.
ఇక నాని కొడుకు అర్జున్( Arjun ) గురించి కూడా ఈమె మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు.నాని కుమారుడు అర్జున్ ముద్దు పేరు జున్ను.వాడంటే నాకు చాలా ఇష్టమని, నన్ను ఎప్పుడు కిట్టి అత్త అంటూ పిలుస్తూ ఉంటారని కీర్తి సురేష్ వెల్లడించారు.తన వాయిస్ చాలా క్యూట్ గా ఉంటుంది.
ఇక నా పుట్టినరోజు సందర్భంగా నాకు విషెస్ చెప్తే ఒక వాయిస్ మెసేజ్ పంపించారని ఆమె ఆ వాయిస్ మెసేజ్ కూడా వినిపించారు.హ్యాపీ బర్త్ డే కిట్టి అత్త అని అర్జున్ చెప్పిన వాయిస్ క్లిప్ ని వినిపించారు.
ఇలా జున్ను ఇంత తొందరగా పెద్ద వాడవడం చాలా సంతోషంగా ఉంది అంటూ నాని ఫ్యామిలీతో తనకున్నటువంటి రిలేషన్ గురించి కీర్తి సురేష్ తెలియజేస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.