ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అమరావతి వ్యవహారం హాట్ టాపిక్ మారింది.గత వైసిపి ప్రభుత్వం రాజధానిగా అమరావతికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వక పోవడంతో అక్కడ అభివృద్ధి పనులు ఎక్కడికి అక్కడే నిలిచిపోయాయి.
దీంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి . టిడిపి ( TDP )మళ్లీ అధికారంలోకి రావడంతో అమరావతి రాజధానిగా అవసరమైన అన్ని హంగులు సమకూర్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు అత్యధికంగా ఈ అంశానికి చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు.ఈరోజు అమరావతిలో కీలక అడుగులు పడబోతున్నాయి. గత ఐదేళ్లుగా అమరావతి కోసం పోరాటాలు చేసిన కూటమి పార్టీలు ఇప్పుడు అక్కడ అభివృద్ధి పై దృష్టి సారించాయి. ఈ మేరకు అమరావతి రాజధాని లో ఇప్పటికే ఉన్న నిర్మాణాల నాణ్యత తేల్చడంతో పాటు, కొత్తగా ఏఏ కంపెనీలను అమరావతిలో పెట్టుబడులకు ఆహ్వానించాలనే దానిపై సీఎం చంద్రబాబు( CM Chandrababu ) ఈరోజు సాయంత్రం కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు.

ఏపీ రాజధానిగా అమరావతిని ఎంపిక చేసిన తరువాత చేపట్టిన నిర్మాణాల పురోగతిని తెలుసుకోవడంతో పాటు, ప్రభుత్వానికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఐఐటి మద్రాస్, ఐఐటి హైదరాబాద్ నిపుణులు ఈరోజు అమరావతికి రానున్నారు.రెండు ఐఐటీ ల నుంచి వచ్చే వేరువేరు బృందాలు గతంలో మధ్యలో నిలిచిపోయిన నిర్మాణాల సామర్థ్యాన్ని అధ్యాయనం చేయనున్నారు.ముఖ్యంగా ఫౌండేషన్ దశలో నిలిచిపోయిన సెక్రటరీయేట్ , శాఖాధిపతుల టవర్లు, హైకోర్టు కట్టడాలను ఐఐటి మద్రాస్ నిపుణులు పరిశీలించనున్నారు.మంత్రులు, ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు, ఉద్యోగుల క్వార్టర్లు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల క్వార్టర్లను ఐఐటి హైదరాబాద్ నిపుణులు పరిశీలించమన్నారు.ఆ తరువాత ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు.

సాయంత్రం 4.30కి సీఎం చంద్రబాబు మున్సిపల్ శాఖ పై సమీక్ష నిర్వహిస్తారు.ఈ సందర్భంగా అమరావతి రాజధాని ( Amaravati )పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారు.
ఆ తరువాత సిఆర్డిఏ సమావేశం ఉంటుంది.చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ భేటీ లో రాజధాని పరిధిలో భూములు ఇచ్చిన కొన్ని సంస్థలకు తమ కార్యాలయాల ఏర్పాటుకు గడువు పొడిగించే అంశం పైన చర్చిస్తారు.