చిరుత పులిని తరిమేసిన కుక్కలు.. వీడియో వైరల్..

పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, అడవుల నరికివేత వల్ల పులులకు ఆవాసాలు తగ్గుతున్నాయి.దీనివల్ల ఆహారం కోసం అవి జనావాసాల వైపు మొగ్గు చూపుతున్నాయి.

 The Dogs Chased Away The Cheetah The Video Is Viralleopard, Nainital, Uttarakhan-TeluguStop.com

అడవుల్లో జంతువుల సంఖ్య తగ్గడం వల్ల పులులకు ఆహారం దొరకడం కష్టంగా మారింది.అందుకే పులులు ప్రజల ఉంటున్న ప్రదేశాల్లోకి వచ్చి ఆవులు, బర్రెలు, కుక్కలపై దాడులు చేస్తున్నాయి.

ఇటీవల ఉత్తరాఖండ్‌ రాష్ట్రం( Uttarakhand ), నైనితాల్‌ పట్టణంలో ఒక చిరుతపులి జనావాసాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఒక ఇంటి వరండాలో ఉన్న కుక్కపై అది అటాక్ చేయాలని చూసింది.అయితే అది కుక్క దగ్గరకు వస్తున్న సమయంలో, రెండు ఇతర కుక్కలు దానిని ధైర్యంగా తరిమేశాయి.ఈ దృశ్యం సీసీ కెమెరాలో రికార్డు అయింది.ఈ అద్భుతమైన వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు.తమ యజమానులను కాపాడటానికి ఈ కుక్కలు చాలా ధైర్యం చూపించాయి.

ఈ వీడియోను జులై 31న ఎక్స్‌లో పంచుకున్నారు.ఆ వీడియో మొదట్లో, ఒక కుక్క ఇంటి గేటు దగ్గర కూర్చుని ఉంది.

అప్పుడు అకస్మాత్తుగా దానికి ఒక చిరుతపులి కనిపించింది.దాంతో సదరు కుక్క షాక్ అయింది, చిరుతపులిపై దాడి చేయడానికి ప్రయత్నించింది.

కానీ కొన్ని సెకన్లలోనే, చిరుతపులి అకస్మాత్తుగా ముందుకు దూకి కుక్కను పట్టుకోవడానికి ప్రయత్నించింది.

అప్పుడు మరో రెండు కుక్కలు వచ్చి చిరుతపులి( Leopard )ని చాలా దూకుడుగా ఎదుర్కొన్నాయి.దీంతో చిరుతపులి భయపడి అక్కడి నుంచి పారిపోయింది.కానీ కొద్ది సేపటికి మళ్లీ తిరిగి వచ్చింది.

కుక్కలు ( Dogs )మళ్లీ అటాక్ చేయడంతో ఈ సారి గేటు దాటి బయటకు పారిపోయింది.ఈ గొడవ జరుగుతున్న సమయంలో, ఇంటి నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి చిరుతపులి వెళ్ళిపోయిందో లేదో చూసారు.

పులి కుక్కల నుంచి తన ప్రాణం కాపాడుకోవడానికి పారిపోయింది అని ట్వీట్‌లో రాశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube