కలెక్టర్లతో చంద్రబాబు కాన్ఫరెన్స్ .. వీటిపైనే ప్రధాన చర్చ ? 

పూర్తిగా పరిపాలనపై ఫోకస్ చేసిన టిడిపి అధినేత చంద్రబాబు( CM Chandrababu ) ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు .గత వైసిపి ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాలను బయటకు తీసే పనిలో నిమగ్నం అయ్యారు.

 Cm Chandrababu Naidu To Conduct Conference With Collectors Details, Ysrcp, Chand-TeluguStop.com

ఇక ఏపీలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు.ఈ మేరకు ఈనెల 5వ తేదీన చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్( Collectors Conference ) నిర్వహించనున్నారు.

  ఈ సమావేశానికి మంత్రులు హాజరుకానున్నారు.

Telugu Ap, Chandrababu, Cm Chandrababu, Rp Sisodia, Ysrcp-Politics

సచివాలయంలో ఈనెల 5వ తేదీన జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహణ ఏర్పాట్లపై ఇప్పటికే రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా( RP Sisodia ) సమీక్ష నిర్వహించారు.  ఈ సమావేశానికి సీసీఎల్ఏ జయలక్ష్మి , గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి,  జి ఏ డి అధికారులు హాజరుకాగా,  కలెక్టర్ల కాన్ఫరెన్స్ కు  కావలసిన అన్ని రకాల ఏర్పాట్లను చేయాల్సిందిగా అధికారులకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసడియా ఆదేశాలు జారీ చేశారు.ముఖ్యంగా గత వైసిపి ప్రభుత్వ హయాంలో జిల్లాలో భూములు,  మైన్స్ , ఇసుక , సహజ వనరుల దోపిడీ జరిగిందని చంద్రబాబు పదే పదే విమర్శలు చేస్తున్నారు.

ఆ అంశాల పైన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ప్రత్యేకంగా చంద్రబాబు చర్చించనున్నారు.

Telugu Ap, Chandrababu, Cm Chandrababu, Rp Sisodia, Ysrcp-Politics

అలాగే ఏపీలో శాంతి భద్రతల పై( AP Law And Order ) ఈ సమావేశంలో ప్రధానంగా సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.  కలెక్టర్లు , ఎస్పీలతో జిల్లాల్లో శాంతిభద్రతలు, గంజాయి సాగు అమ్మకాలపై కట్టడి వంటి అంశాల పైన ప్రత్యేకంగా చర్చించనున్నారు.సీఎంగా బాధ్యతలు నిర్వహించిన దగ్గర నుంచి సీఎం చంద్రబాబు గత వైసిపి ప్రభుత్వం లో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాలపై విచారణలు చేయిస్తూ .శాఖల వారీగా శ్వేత పత్రాలను విడుదల చేస్తున్నారు.ఈ అంశాలు పైన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చంద్రబాబు ప్రధానంగా చర్చించనున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube