హెచ్ 1 బీ వీసా ప్రక్రియలో మోసాలు.. కలకలం రేపుతోన్న బ్లూమ్‌బెర్గ్ నివేదిక

నిపుణులైన వృత్తి పనివారిని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పనిచేసుకోవడానికి అనుమతించే హెచ్ 1 బీ వీసా( H1 B Visa ) హాట్ కేక్ లాంటిది.అగ్రరాజ్యంలో స్ధిరపడాలని.

 H1 B Visa Bloomberg Investigative Report Blames Staffing And Outsourcing Compani-TeluguStop.com

లక్షలాది డాలర్లు సంపాదించాలని కోరుకునేవారు హెచ్ 1 బీపై ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు.కానీ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పోటీపడుతుండటంతో హెచ్ 1 బీ కోసం యుద్ధం చేయాల్సి వస్తోంది.

ఈ నేపథ్యంలో హెచ్ 1 బీ వీసా ప్రక్రియపై బ్లూమ్‌బెర్గ్( Bloomberg ) సంచలన నివేదికను వెలువరించింది.సిబ్బంది, ఔట్‌సోర్సింగ్ కంపెనీలచే తారుమారు చేయబడుతోందని, శ్రమ దోపిడీ జరుగుతోందని బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది.

2023లో 4,46,000 మంది హెచ్1 బీ వీసాలు కోరగా.కేవలం 85,000 మందికి మాత్రమే అందుబాటులో ఉన్నాయని నివేదిక వెల్లడించింది.

వీటిలో 11,600 వీసాలు బహుళజాతి ఔట్‌సోర్సింగ్ కంపెనీలకు వెళ్లాయి.విస్తారమైన విదేశీ వర్క్‌ఫోర్స్‌తో లాటరీని ఎంట్రీలతో నింపగా.

మరో 22,600 మంది ఐటీ సిబ్బంది ఆయా సంస్థల్లో ప్రవేశించారు.మొత్తం మీద సగం హెచ్1 బీలు ఔట్‌సోర్సింగ్ లేదా సిబ్బందిని నియమించే కంపెనీలకు వెళ్లాయి.

బ్లూమ్‌బెర్గ్ పరిశోధనలో చాలా మంది ఒకే ఉద్యోగి కోసం మల్టీ ఎంట్రీలను సమర్పించడం ద్వారా భారీ స్థాయిలో మోసానికి పాల్పడినట్లు పేర్కొంది.

Telugu Bloomberg, Visa Loopholes, Visalottery, Visa Multiple, Visa, Staff, Multi

డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్)కి వ్యతిరేకంగా దాఖలైన దావా కారణంగా బ్లూమ్‌బెర్గ్ పొందిన 2020-23 డేటా ప్రకారం ‘మల్టిపుల్ రిజిస్ట్రేషన్ ’( Multiple Registration ) అని పిలవబడే ప్రాక్టీస్ ద్వారా నిర్దిష్ట సిబ్బంది సంస్థలు హెచ్ 1 బీ లాటరీ( H1 B Visa Lottery ) వ్యవస్థను ఎలా తెలివిగా ఉపయోగించుకున్నాయో తెలిపింది.దీని ప్రకారం ఒకే వ్యక్తికి బహుళ ఎంట్రీలను సమర్పించవచ్చు.యూఎస్ పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్) దీనిని మోసంగా అభివర్ణించింది.

ఇలా దాదాపు 15,500 వీసాలు లేదా గతేడాది మంజూరైన ప్రతి ఆరింటిలో ఒకటి ఇలాంటి మోసపూరిత మార్గాల ద్వారా పొందినట్లు నివేదిక తెలిపింది.

Telugu Bloomberg, Visa Loopholes, Visalottery, Visa Multiple, Visa, Staff, Multi

తొలుత ‘‘ first-come, first-served ’’ విధానంలో హెచ్ 1 బీ వీసాలను కేటాయించేవారు.అయితే హెచ్ 1 బీ వీసాల సంఖ్యను 85,000కి పరిమితం చేయడంతో అధిక డిమాండ్ కారణంగా లాటరీ విధానాన్ని తీసుకొచ్చారు.ప్రతి ఏడాది దరఖాస్తులదారుల పూల్ నుంచి ర్యాండమ్‌గా కొన్ని పేర్లను తీసుకుటుంది.

ఇది ఇటీవలి కాలంలో దాదాపు రెండింతలు పెరగ్గా, వీసాను పొందే అవకాశాలు తగ్గిపోయాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube